ఇండస్ట్రీ హిట్ బాహుబలి సిరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి నుండి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రాంచరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం.. జనవరి 7న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా ట్రైలర్ విడుదలై భారీ యాక్షన్ సన్నివేశాలతో అంచనాలను రెట్టింపు చేసింది.
మరి ట్రైలర్ చూసినట్లయితే గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. అందుకోసమే ఆర్ఆర్ఆర్ మేకర్స్ చిత్రాన్ని 2D మాత్రమే కాకుండా కొంతమేరకు 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు ట్రైలర్ చివరిలో మెన్షన్ చేసారు. అంటే ఆర్ఆర్ఆర్ సినిమాని 3Dలో చూసి అనుభూతి పొందే అవకాశం రాబోతుందని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి రాజమౌళి తెరకెక్కించిన కొన్ని చిత్రాలలో(బాహుబలి సిరీస్ తో పాటు) యుద్ధ సన్నివేశాలు ఉన్నప్పటికీ 2Dలో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ టైం ఆర్ఆర్ఆర్ తో 3D ఎక్స్పీరియన్స్ కలిగించనున్నారు మేకర్స్.
మరి నార్మల్ స్క్రీన్ పై 2Dలో చూస్తేనే థియేటర్లలో హంగామా వేరే లెవెల్లో ఉంటుంది. అదే 3Dలో అంటే ఇంకా ప్రతి యాక్షన్ సీన్ హైలైట్ అవుతుంది. సో చూడాలి మరి రాజమౌళి 3D వెర్షన్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ – అలియా భట్ – ఒలీవియా మోరిస్ – సముద్రఖని – శ్రీయ లాంటి భారీ తారాగణం కనిపించనుంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.