దర్శక ధీరుడు, తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి. తొలుత తెలుగురాష్ట్రాల్లో.. ఆ తర్వాత దేశంలో.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మరోమోగిపోతుంది. అందుకు కారణం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ. ఆయన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ఇండియన్ సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. తాజాగా ఈ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు సైతం దక్కింది. ఈ సినిమాకు సంగీతం అందించిన ఎమ్‌ఎమ్ కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. దీంతో మరోసారి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
అయితే.. ఇండియాకు చెందిన సినిమాకు గోల్డెన్ గ్లోబ్ లాంటి పెద్ద అవార్డు రావాడంతో.. అందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ను బాలీవుడ్ మూవీ అనుకుంటున్నారని.. అయితే ఇది బాలీవుడ్ మూవీ కాదని.. పక్కా తెలుగు సినిమా అని, సౌత్ ఇండియన్ మూవీని అని రాజమౌళి చాలా గర్వంగా ప్రకటించారు. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఆర్‌ఆర్‌ఆర్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు లభిస్తే.. దాదాపు ఆస్కార్ కూడా వచ్చినట్లే అని చాలా మంది భావిస్తారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు సైతం ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని చాలా మంది సినీ ప్రముఖలు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాకు కూడా ఆస్కార్ అవార్డు దక్కలేదు. ఇండియా నుంచి మాత్రం ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అయితే.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఆర్‌ఆర్‌ఆర్ కావడం విశేషం. కాగా.. ఇలాంటి గొప్ప సినిమా గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీకి, అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి కాకుండా.. కేవలం బాలీవుడ్‌కు సంబంధించిన మూవీగా చాలా మంది విదేశీలు భావిస్తున్న తరుణంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH: #SS Rajamouli says,
“#RRR is a #Telugu film, not #Bollywood!”#USA #entertainment @ssrajamouliFC @JrNTRDevotees @AlwayzRamCharan @TeamAliaTelugu @SSRajamouli_FC @JrNTRFanGirls @The_RamCharanFC @aliabhattfan7 #GoldenGlobes2023 #GoldenGlobes #award @ssrajamouli_fan #news pic.twitter.com/hWwUDv0bjo— News9 (@News9Tweets) January 12, 2023
The winner for Best Song – Motion Picture is @mmkeeravaani for their song “Naatu Naatu” featured in @RRRMovie! Congratulations! 🎥✨🎵 #GoldenGlobes pic.twitter.com/ENCUQEtns3
— Golden Globe Awards (@goldenglobes) January 11, 2023