ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ద సినిమాలకంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. బిగ్ హిట్ కొట్టాలంటే.. బిగ్ బడ్జెట్.. బిగ్ స్టార్స్.. ఎక్సపీరియెన్స్ ఉన్న స్టోరీ టెల్లర్స్ అవసరం లేదని ప్రూవ్ చేస్తున్నాయి చిన్న సినిమాలు. అలా గతేడాది సంచలన విజయాలు అందుకుంది కాంతార సినిమా. తాజాగా కాంతార కంటే తక్కువ బడ్జెట్.. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఓ మలయాళం సినిమా..
ఇటీవల ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ద సినిమాలకంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. బిగ్ హిట్ కొట్టాలంటే.. బిగ్ బడ్జెట్.. బిగ్ స్టార్స్.. ఎక్సపీరియెన్స్ ఉన్న స్టోరీ టెల్లర్స్ అవసరం లేదని ప్రూవ్ చేస్తున్నాయి చిన్న సినిమాలు. కొన్నాళ్లుగా మీరు గమనిస్తే.. కమర్షియల్ సినిమాలంటే.. కథానుసారంగా సాగే సినిమాలు.. కంటెంట్ ఉన్న సినిమాలే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఏదైనా కంటెంట్, ఫ్రెష్ నెస్ ముఖ్యం బిగిలు.. అని ఆల్రెడీ ఆడియెన్స్ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. అలా గతేడాది సంచలన విజయాలు అందుకున్నాయి లవ్ టుడే, కాంతార సినిమాలు.
లవ్ టుడే మూవీ తమిళ, తెలుగు వరకే రిలీజ్ అయినప్పటికీ.. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ.. కాంతార మూవీ.. ఊహించని స్థాయిలో పాన్ ఇండియాని షేక్ చేసేసింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార.. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేసింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. హీరోగా నటించి, రూపొందించిన ఈ సినిమాని కేజీఎఫ్, సలార్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు. ఇలాంటి అద్భుతాలు అరుదుగానే జరుగుతుంటాయి. కాగా.. తాజాగా కాంతార కంటే తక్కువ బడ్జెట్.. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఓ మలయాళం సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లను దాటి కలెక్షన్స్ రాబడుతూ ట్రెండ్ సెట్ చేస్తోంది.
ప్రస్తుతం ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా తెరకెక్కిన ఆ మలయాళం చిన్న సినిమా.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా పేరు ‘రోమాంచమ్’. అంటే ఇంగ్లీష్ లో గూస్ బంప్స్ అని దానర్థం. ఇటీవల ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజైన ఈ హారర్ కామెడీ మూవీకి సంబంధించి.. యాక్టర్స్, టెక్నికల్ టీమ్ అందరూ 95% కొత్త వాళ్లే. ఈ సినిమా రిలీజ్ చేసేందుకు కనీసం డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆసక్తి చూపలేదట. అలాంటిది.. ఎట్టకేలకు రిలీజ్ అయ్యాక.. దుమ్ముదులుపుతూ నెల రోజుల్లోనే రూ. 54 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికీ ఈ రోమాంచమ్ మూవీ థియేటర్స్ లో రన్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. కాంతార, లవ్ టుడే మూవీస్ తర్వాత ఊహించిన విజయాన్ని అందుకున్న చిన్న సినిమాగా ‘రోమాంచమ్’ రికార్డులోకెక్కింది. కొన్నేళ్లుగా మళయాలం ఇండస్ట్రీనే బెస్ట్ కథలను అందిస్తోంది. ఇప్పటిదాకా ఎన్నో మలయాళం సినిమాలను.. తెలుగుతో పాటు ఇతర భాషలవారు రీమేక్స్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో.. ఇప్పుడు రోమాంచమ్ మూవీ సక్సెస్ గురించి తెలిసేసరికి.. టాలీవుడ్ నుండి ప్రముఖ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారని సమాచారం. ఇక రోమాంచమ్ సినిమాలో జనాలకు తెలిసిన నటుడు సౌబిన్ షాహిర్ ఒక్కడే. కాగా.. ఈ సినిమాని జీతూ మాధవన్ తెరకెక్కించగా.. జాన్ పాల్ జార్జ్, గిరీష్ గంగాధరన్, జోబి జార్జ్ సినిమాని నిర్మించారు. మరిప్పుడు విషయం తెలిసిన తెలుగు ఆడియెన్స్ సైతం రోమాంచమ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి చిన్న సినిమాలు బిగ్ సక్సెస్ అందుకుంటున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.