రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను గత తొమ్మిది సంవత్సరాలుగా కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ షో జబర్దస్త్. ఇక ఈ షో ద్వారా పరిచయం అయిన నటులు వెండితెరపై కూడా తమదైన ముద్ర వేస్తున్న సంగతి మనకు తెలిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో అభిమానులను అలరిస్తుంటారు జబర్దస్త్ షో మేకర్స్. ఈ క్రమంలోనే అక్టోబర్ 20వ తారీఖుకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగానే ఈ ప్రోమోలో సైతం ఆది తనదైన పంచులతో చెలరేగగా.. రాకెట్ రాఘవ మాత్రం జబర్దస్త్ రెమ్యూనరేషన్స్ పై సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రాఘవ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
రాకెట్ రాఘవ.. జబర్దస్త్ కామెడీ షో ప్రారంభం కానప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాడు. ఇక ఎప్పుడైతే జబర్దస్త్ షో మెుదలైందో.. అప్పటి నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చేస్తున్నాడు రాఘవ. అదీ కాక ప్యూర్ వెజ్ కామెడీతో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రీయేట్ చేసుకున్నాడు. చాలా మంది షో నుంచి వెళ్లిపోయి తిరిగి వస్తున్నాగానీ.. తాను మాత్రం జబర్దస్త్ లో పాతుకుపోయాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో రెమ్యూనరేషన్ పై తనదైన వ్యంగ్యాస్త్రాలు విసిరాడు రాఘవ. ఈ ప్రోమోలో రాఘవ టెన్నిస్ క్రీడాకారిణిగా గెటప్ వేశాడు. ఇక టీమ్ మెట్ అయిన నాగి.. టెన్నిస్ ప్రత్యర్థిగా బరిలోకి దిగి స్టేజ్ పై ఎగురుతూంటాడు. ఈ క్రమంలోనే నాగి “రేయ్ నేను ఇంతగనం ఎగురుతుంటే.. అది గింత కూడా ఎగరట్లేదు ఎందుకురా?” అంటాడు.
దానికి రాఘవ..”ఎగిరెగిరి దంచినా అదే కూలీ.. ఎగరకుండా దంచినా అదే కూలీ” అంటూ పంచ్ విసురుతాడు. మరి మేనేజర్ దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చుకదా అంటే? ఆ.. వెళ్లినప్పుడల్లా కొత్త టీమ్ లను తెస్తాం అంటున్నారని” రాఘవ చెప్తాడు. దాంతో రడీ రడీ అంటూ.. నాగీ వెళ్ళిపోతాడు. ఎంత చేసిన రెమ్యూనరేషన్ పెంచరు అని రాఘవ గారి ఫీలింగా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజన్స్.. ఏంటి రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువ ఇస్తారా? అంటే పాపం రాఘవ గారు రెమ్యూనరేషన్ పెంచమని ఇండైరెక్ట్ గా మల్లెమాల యాజమాన్యానికి చెప్పినట్లున్నారు.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.