తెలుగు బుల్లి తెర పాపులర్ కామెడీ షో ఏంటంటే ఠక్కున గుర్తుకు వచ్చేది జబర్థస్త్. ఈ షోలో లేడీ కమెడియన్ గా మెప్పిస్తున్నారు రీతూ చౌదరి. టిక్ టాక్ నుండి సీరియల్ నటిగా మారిన ఆమె. అనంతరం ఈ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి, తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాగా, ఇటీవల ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. రీతూ తండ్రి ఇటీవల గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణించిన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తాజాగా మరోసారి నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టు చూసిన వారంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతున్నారు.
‘డాడీ నా వల్ల ఎంత ట్రై చేసినా నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా, నువ్వు లేవన్నదీ ఇమాజిన్ చేసుకోలేకపోతున్న. నీ అంత ప్రేమ ఎవరూ నాకు చూపించలేరు. నీ అంత పాంపర్ ఎవరూ నన్ను చేయలేరు. నేను అలిగితే బ్రతిమలాడేది నువ్వు. నాకు కోపం వచ్చినప్పుడు చిరాకు పడినా, మళ్లీ ప్రేమతో నవ్వుతావ్. ఎవరైనా నన్ను ఒక్కమాట అంటే ఫీల్ అయి తిట్టేసేవాడివి. అలాంటిది ఎలా డాడీ నన్ను వదిలి వెళ్లిపోవాలని అనిపించింది. చెప్పు డాడీ ఇప్పుడు నాకు అన్నం తినిపించేది ఎవరు. నన్ను మోటివేట్ చేసేది, యాక్టివ్ గా ఉంచేది ఎవరు చెప్పు డాడీ’ అంటూ ఎమోషనల్ పోస్టు చేశారు.
‘ప్లీజ్ డాడీ.. తిరిగి రా మనం రీల్స్ చేసుకుందాం. నువ్వు చెప్పినట్లు అన్ని జ్యూస్ లు తాగుతాను. మంచు ఫుడ్ తింటా. త్వరగా నిద్రపోతా. నువ్వు చెప్పినట్లే ఉండాను. ప్లీజ్ రా డాడీ, నీ కూతురు పులి అన్నవు కదా డాడీ, నీ పులిని వదిలేసి వెళ్లిపోతావా? అమ్మ, అన్నయ్య ఉండలేకపోతున్నారు డాడీ, ప్లీజ్ రా డాడీ’ అంటూ ఎమోషనల్ అయ్యారు. తన నాన్నతో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.