సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ పంథా వేరనే విషయం అందరికి తెలిసిందే. కొన్నిసార్లు వర్మ అంటే వివాదాలకు అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ రాబట్టుకుంటాడు. మరో విశేషం ఏంటంటే.. వర్మ తన సినిమాలన్నింటిని ట్విట్టర్ ద్వారానే ప్రకటిస్తుంటాడు. కానీ ఎన్ని ఎక్కువ సినిమాలు ప్రకటిస్తాడో.. ఆయన నుండి అన్ని తక్కువ సినిమాలు తెరపైకి వస్తుంటాయి.
వర్మ సినిమాలలో కొన్ని ప్రకటనల వరకే ఆగిపోతుంటాయి. ట్విస్ట్ ఏంటంటే.. వర్మ ఎప్పుడు ఏ సినిమాతో వస్తాడో తెలియదు. కానీ పక్కా వస్తాడని మాత్రం తెలుసు. అయితే.. అందరూ 2021 సంవత్సరం పూర్తయిపోతుందని పార్టీలు చేసుకోవడం, మరికొందరు ఏడుపుగొట్టు స్టేటసులు పెడుతూ తమ సెలెబ్రేషన్స్ వ్యక్తపరుస్తున్నారు. న్యూ ఇయర్, బర్త్ డేస్, ఫెస్టివల్స్ ఇలా ఏవి వర్మ పట్టించుకోడు.
అందరికి జనవరి 1 వస్తే.. 2021 అప్పుడే ముగిసిందా? అనే ఫీలింగ్ వస్తుంది. కానీ వర్మ ఈ విషయంలో చాలా క్లియర్. అందుకు ఆయన చేసిన తాజా ట్వీట్ సాక్ష్యం. ‘హ్యాపీ న్యూ ఇయర్ అనేది పాత సంవత్సరంలో ఆఖరి రోజుకు మాత్రమే వర్తిస్తుంది అంటే ఈరోజే. ఎందుకంటే రేపు అనేది కొత్త సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి. మీరంతా రేపు మార్నింగ్ విపరీతమైన తలనొప్పి, ఓమిక్రాన్ లతో నిద్రలేస్తారు. ఎందుకంటే ఈరోజు రాత్రంతా పార్టీలో అందరిని కలుసుకుంటారు. అందరికి SAD NEW YEAR’ అంటూ ట్వీట్ లో విష్ చేసాడు. ఎంతైనా వర్మ చెప్పింది నిజమే అని కొందరు, హ్యాపీ మూడ్ లో SAD ఏంటని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి వర్మ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.
Happy New Year only works for the last night of old year which is tonite, because tmrw , the new year’s 1st day, you will wake up with a heavy headache from both alcohol and possibly OMICRON , which u might pick up at the party tonite #SadNewYear
— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2021