వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల అషురెడ్డితో కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారి.. వివాదాలకు దారితీసింది. ఎంతోమంది ఆ వీడియోపై స్పందిస్తూ నెగటివ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్జీవీ దిగజారిపోయాడని.. అషురెడ్డి కాలి వేళ్ళు ముద్దాడటం ఏంటంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆ వీడియోపై, ఆర్జీవీపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే.. తాజాగా అషురెడ్డితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ గురించి, ఆమె కాలి వేళ్ళను ముద్దాడటం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ.
ఇక అషురెడ్డి ఇంటర్వ్యూ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ.. “ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించి కాదు. ముఖ్యంగా నా సో కాల్డ్ ఫాలోయర్స్ కోసం కాదు. సోషల్ మీడియాలో నా కోట్స్, పోస్టులు.. ఇలా నేనేం చేసినా బిట్లు బిట్లుగా మార్చేసి.. మీమ్స్, ఇలా చేశాడంట, అలా చేశాడంట అని రాసేస్తున్నారు. నేను అషురెడ్డి ఇంటర్వ్యూలో ఆమె కాలిని ముద్దు పెట్టుకోవడం గానీ, అలా ఎందుకు ప్రవర్తించాను అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలనేది నా ఉద్దేశం. అడల్ట్ ఏజ్ దాటాక అందరికీ ఓ ఇండివిజువాలిటీ ఉంటది. ఆ ఇంటర్వ్యూలో నాకు, అషురెడ్డికి మధ్య ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చేసిన కన్వర్జేషన్ అనే మా ఇద్దరి వరకే. మిగతా వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు.
లైఫ్ అందరూ కష్టపడి పనిచేస్తారు. కానీ.. అందరికి ఎంటర్టైన్ మెంట్ అనేది అవసరం. ఆ ఎంటర్టైన్ మెంట్ కోసం కొందరు స్పోర్ట్స్ ఆడతారు, ఇంకొందరు పేకాట ఆడుతారు.. ఇంకా సినిమా చూడటం.. ఇలా వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ఒక్కొక్కటీ ఎంచుకుంటారు. మీకు ఇష్టం లేకపోతే చూడటం మానేయండి.. వేరే పనులు లేవా మీకు? అదంతా కేవలం నా ఎంటర్టైన్ మెంట్ కోసం.. ఆ టైమ్ లో నేనేం ఫీల్ అయ్యానో అదే చేశాను. ఎప్పుడైనా సరే నేనేం ఫీల్ అవుతానో అదే మాట్లాడతాను. అషురెడ్డి కాళ్లను ముద్దాడటం కూడా అంతే.” అని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి వర్మపై కామెంట్స్ చేసిన నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.