వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ చేస్తూ హైలెట్ చేస్తుంటాడు. అయినాసరే తాను అనుకున్న బోల్డ్ కంటెంట్ సినిమాలను తెరకెక్కిస్తూ.. మాస్ ప్రమోషన్స్ చేసేస్తాడు. ఈ క్రమంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ మూవీ ‘డేంజరస్’. లెస్బియన్ రొమాన్స్ జానర్ లో రూపొందించిన ఈ సినిమా డిసెంబర్ 9న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. నైనా గంగూలీ, అప్సర రాణి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. కాగా.. రిలీజ్ దగ్గర పడుతుండటంతో వర్మ ప్రమోషన్స్ చేసే స్టైల్ మారుస్తూ వస్తున్నాడు.
వర్మ హీరోయిన్స్ అంటేనే ఎంతో బోల్డ్ గా.. ఎలాంటి మొహమాటం లేకుండా ఉంటారు. అలా లేకపోయినా వర్మ కంట పడ్డాక తనకు కావాల్సిన విధంగా మారిపోతాడు లేదా మార్చుకుంటాడు. వర్మ ద్వారా పాపులర్ అయిన అమ్మాయిలలో అషురెడ్డి, అరియానా గ్లోరీ.. ఇనాయ సుల్తానా ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళను బోల్డ్ బ్యూటీలుగా గుర్తించి.. బిగ్ బాస్ లో కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాడు వర్మ. ఈ నేపథ్యంలో డేంజరస్ సినిమా ప్రమోషన్స్ కోసం అషురెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు వర్మ. ఇక ఎలాగో క్రేజ్ తెచ్చిన వ్యక్తి కాబట్టి.. అషురెడ్డి కూడా కాదనకుండా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక వర్మ స్త్రీల అందాన్ని పూజిస్తాడు కాబట్టి.. అషురెడ్డి పాదాల వద్ద కూర్చొని ఇంటర్వ్యూ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.