ఇండస్ర్టీలో కొంతకాలం సినిమాలు చేసి పెళ్లి అవ్వగానే ఇండస్ట్రీకి, నటనకు దూరంగా ఉండేవారు చాలామంది ఉంటారు. అలాగని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయరని కాదు.. వారికి నచ్చిన క్యారెక్టర్, స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతారు. అయితే.. హీరోయిన్స్ కి పెళ్లయ్యిందంటే చాలు.. ఆ వెంటనే భర్త, పిల్లలు, ఫ్యామిలీ ఇలా కొన్ని బాధ్యతలు మీదపడటంతో వారు సినిమాలకు దూరం అవ్వాల్సి ఉంటుంది. అలాగని అందరి విషయంలో అలా జరగదు. పెళ్ళైన హీరోయిన్స్ పిల్లల కోసం గ్యాప్ తీసుకొని మరీ సినిమాలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ.. కొందరి విషయంలోనే పిల్లలు ఉండి, కుటుంబ బాధ్యతలున్నా ఎప్పుడెప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తారా? అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్.
ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ లో అభిమానుల ఎదురుచూపులు నటి రేణుదేశాయ్ కోసం కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రేణుదేశాయ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు(అకీరా నందన్, ఆధ్యా). కొన్నేళ్ల కిందటే పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ విడిపోయి ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. అప్పటినుండి పిల్లలను రేణుదేశాయ్ చూసుకుంటోంది. అయితే.. ఇంతకాలం సినిమాలకు దూరమైనా రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం అలాగే ఉంది. అలాగే ఓ మంచి తల్లిగా, పిల్లలను తండ్రికి దగ్గరగా ఉంచుతూ వస్తున్న రేణుదేశాయ్ అంటే పవన్ ఫ్యాన్స్ కి ఎంతో అభిమానం.
ఇక ఇన్నేళ్లపాటు నటనకు, సినిమాలకు దూరంగా ఉన్నా.. రేణుదేశాయ్ బుల్లితెర ప్రోగ్రాంస్, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంటోంది. అయితే.. సినిమాల్లోకి రేణుదేశాయ్ రీఎంట్రీ ఎప్పుడు? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో హేమలత లవణం అనే కీలకపాత్రలో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది రేణుదేశాయ్. హేమలత అంటే టైగర్ నాగేశ్వరరావు అక్క. మరి రవితేజకు అక్కగా రేణుదేశాయ్ కనిపించనుందన్నమాట. మొత్తానికి రేణుదేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసింది. మరి రేణుదేశాయ్ రీఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.