టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ 2022 ఏడాదికి వీడ్కోలు చెబుతూ.. కాస్త భావోద్వేగానికి లోనైయ్యారు. క్రాక్ సినిమా తర్వాత.. వరుస పరాజయాలు చవిచూసిన రవితేజ.. ఇటివల ‘ధమాకా’ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌ను అందుకున్నారు. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రవితేజ కెరీర్‌లోనే భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాతో.. రవితేజ 2022 ఏడాదికి మంచి విజయంతో వీడ్కోలు పలికారు. ఈ సినమా విడుదలైన కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.
ఈ సినిమా విజయంతో పాటు.. 2022కు వీడ్కోలు పలుకుతూ.. రవితేజ ఒక ట్విట్టర్‌లో ఒక పోస్టు చేశారు. ఆ పోస్టులో రవితేజ కాస్త ఎమోషనల్ అయ్యారు. ‘నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు… ధమాకాను మర్చిపోలేని చిత్రంగా మార్చినందుకు మీ అందరకి చాలా థ్యాంక్స్. ఈ విజయాన్ని 2022లో మన కోల్పోయిన దిగ్గజాలకు అంకితం చేస్తున్నాను. ఈ ఏడాది ఎంతో కష్టంగా గడిచింది. కానీ మీ షరతులు లేని ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుంది. 2023లో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అంటూ రవితేజ ట్వీట్ చేశారు.
త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన ఈ ధమాకాలో రవితేజ సరసన యువ కథానాయిక శ్రీలీల నటించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాకు మొదట్లో డివైడ్ టాక్ వచ్చినా.. టాక్‌కు భిన్నంగా ధమాకా రికార్డు స్థాయి కలెక‌్షన్లతో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా విజయాన్ని రవితేజ దివికేగిన దిగ్గజాలకు అంకితం ఇవ్వడంపై ఆయన అభిమానులు ఎంతో ప్రశంసిస్తున్నారు. 2022లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్టతో పాటు విలక్షణ నటులు కైకాల సత్యానారాయణ, చలపతిరావు లాంటి ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. మరి ధమాకా విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#HappyNewYear2023 🤗 pic.twitter.com/Xuxw28TCty
— Ravi Teja (@RaviTeja_offl) January 1, 2023