బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి తెలియని వారుండరు. హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఉత్తరాది ఆడియెన్స్‌ను ఆమె ఉర్రూతలూగించారు. అందం, అభినయంతో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్నారు. డ్యాన్స్‌లోనూ అదరగొట్టి భేష్ అనిపించుకున్నారు. ‘ఆకాశవీధిలో’, ‘బంగారుబుల్లోడు’ లాంటి చిత్రాలతో తెలుగులోనూ అలరించారు. 90వ దశకంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన రవీనా టాండన్.. ఆ తర్వాత కాలంలో చిత్రాలను తగ్గించారు. అయితే ఇటీవల ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో మరోసారి ఆమె ప్రేక్షకులను పలకరించారు. ఇందులో తనదైన శైలిలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.
చిత్ర పరిశ్రమలో బాడీ షేమింగ్ అంశంపై రవీనా టాండన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 90వ దశకంలో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో తనను కొందరు బాడీ షేమింగ్ చేశారని రవీనా అన్నారు. తన శరీరంలోని కొన్ని పార్ట్స్‌పై వల్గర్‌గా మాట్లాడారని ఆమె వాపోయారు. ‘నేను 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చా. అప్పుడు నా శరీరంలో కొంచెం కొవ్వు ఉండేది. అది ఇంకా పోలేదు. దాని వల్ల నా మీద కూడా బాడీ షేమింగ్ జరిగింది. అప్పుడు కొంచెం బాధపడినా.. ఇప్పుడు మాత్రం దాన్ని పట్టించుకోవడం మానేశా’ అని రవీనా టాండన్ వ్యాఖ్యానించారు. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన పలు చేదు ఘటనల గురించి కూడా ఆమె పంచుకున్నారు.
సినిమాల్లో కొన్నింటి విషయంలో తాను అసౌకర్యంగా ఫీలయ్యేదాన్నని రవీనా టాండన్ అన్నారు. అలాంటి వాటిని చేయనని కచ్చితంగా చెప్పేసేదాన్నని ఆమె పేర్కొన్నారు. ‘డ్యాన్స్ విషయంలో నచ్చని మూమెంట్స్ చేయాలన్నా.. సీన్స్ కోసం స్విమ్మింగ్ కాస్టూమ్స్ వేసుకోమన్నా నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాగే కిస్ సీన్స్‌లో కూడా యాక్ట్ చేయలేదు. అందుకే నాపై అహంకారి అనే ముద్ర వేశారు. దీని వల్ల కొన్ని చాన్సులు కూడా కోల్పోయా. సినిమాల్లో ఇప్పటివరకు నేను రెండు రేప్ సీన్స్‌లో నటించా. వాటిలో ఎలాంటి అసభ్యతకు చోటివ్వలేదు. డ్రెస్సుపై ఒక్క చిరుగు కూడా లేకుండా రేప్ సీన్స్‌లో యాక్ట్ చేసిన నటిని నేనొక్కదాన్నే కావొచ్చు’ అని రవీనా టాండన్ వ్యాఖ్యానించారు. మరి, చిత్ర పరిశ్రమలో బాడీ షేమింగ్ ఉందని.. తన మీద కూడా బాడీ షేమింగ్ జరిగిందంటూ రవీనా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.