కన్నడ హీరోయిన్ గా పరిచయమైన రష్మిక.. జస్ట్ ఐదారేళ్లలోనే ఇండియా వైడ్ ఫేమ్ సంపాదించింది. ఇప్పుడు ఏకంగా కొరియన్ యాక్టర్స్ తో కలిసి కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నేషనల్ క్రష్ అయిన హీరోయిన్ రష్మిక.. ఎప్పుడూ ఏదో విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అభిమానులని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది. ఓవైపు పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. వీలు చిక్కినప్పుడల్లా టూర్స్, ఈవెంట్స్ కు వెళ్తూ తెగ సందడి చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ అమ్మడు చేసే అల్లరికి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతూనే ఉన్నారు. ఈ మధ్య దుబాయ్ వెళ్లివచ్చిన రష్మిక.. ఇప్పుడో మరో టూర్ లో ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే కన్నడంలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన రష్మిక ఆ తర్వాత తెలుగు, తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది హిందీలోనూ సినిమాలు చేసి బాలీవుడ్ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇలా ఇండియా వైడ్ పాపులర్ అయిన రష్మిక.. ఇప్పుడు విదేశాల్లో యమ క్రేజ్ అందుకుంటోంది. తాజాగా ఇటలీలో మిలాన్ ఫ్యాషన్ వీక్ జరగ్గా.. అక్కడ తళుక్కన మెరిసింది. ఈ ఈవెంట్ దేశ విదేశాల నుంచి చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు. అలా రష్మిక కూడా వైట్ అండ్ వైడ్ డ్రస్ లో జిగేలుమని మెరిసిపోతూ కనిపించింది.
అయితే ఇదే ఫ్యాషన్ వీక్ కు దక్షిణ కొరియా నటుడు జంగ్ ఊ, థాయిలాండ్ నటుడు గల్ఫ్ కానవత్ వచ్చారు. ఇప్పుడు వీళ్లతో కలిసి రష్మిక ఫొటోలు దిగడమే కాకుండా పాటలకు స్టెప్పులు కూడా వేసింది. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా రీసెంట్ గా ‘వారసుడు’తో ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక.. రీసెంట్ గా ‘యానిమల్’ షూటింగ్ కంప్లీట్ చేసింది. త్వరలో ‘పుష్ప 2’ షూటింగ్ లో పాల్గొనుంది. ఇలా ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ.. త్వరలో కొరియన్ భాషలో నటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి కొరియా, థాయ్ యాక్టర్స్ తో రష్మిక ఫొటోలకు పోజిలివ్వడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.