ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందాన, హీరో రిషబ్ శెట్టిల వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా విమర్శలు చేసుకొని వార్తల్లో నిలిచారు. ఈ వివాదం మొదలవ్వడానికి కారణం మాత్రం గతంలో రష్మిక చేసిన కామెంట్స్ అని అంటున్నారు. పైగా రష్మిక కామెంట్స్ పై కాంతార మూవీ తర్వాత రిషబ్ శెట్టి కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం హీరోయిన్ గా స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మికని.. కిరాక్ పార్టీ సినిమా ద్వారా రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ సినిమా టైంలో హీరో రక్షిత్ తో ప్రేమాయణం నడిపింది రష్మిక.
ఆ తర్వాత ఏమైందో గానీ.. ఎంగేజ్ మెంట్ అయ్యాక ఇద్దరూ విడిపోయారు. అప్పటినుండి ఎవరి దారిలో వారు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రిషబ్, రక్షిత్ ఇద్దరూ ఎప్పుడు దీనిపై స్పందించలేదు. అయితే.. హీరోయిన్ గా సక్సెస్ లో ఉన్నప్పుడు రష్మిక.. రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ ని ‘సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్’ అంటూ.. కనీసం అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా చేతులతో సైగలు చేస్తూ కౌంటర్ వేసింది. అప్పట్లో రష్మిక వీడియో ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. కట్ చేస్తే.. కాంతార హిట్ అయ్యాక రిషబ్ శెట్టి కూడా రష్మిక స్టైల్ లోనే తిరిగి కౌంటర్ వేయడం ఆశ్చర్యపరిచింది. ‘కొత్తవాళ్లతో సినిమాలు చేస్తా. కానీ.. ఇలాంటి వారితో అసలు వర్క్ చేయను’ అంటూ రష్మికలాగే సైగలు చేశాడు.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. ఇన్నాళ్లు చేసిన కామెంట్స్ పై ప్లేట్ మార్చి రక్షిత్, రిషబ్ శెట్టిల గురించి పాజిటివ్ గా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. తానిప్పుడు నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయ్యానని.. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం.. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిలే అని చెప్పి ఆశ్చర్యపరిచింది. అలాగే తనపై వస్తున్న ట్రోల్స్ కూడా తీవ్రమయ్యాయని.. ఇకపై సహించబోనని తేల్చి చెప్పేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రక్షిత్, రిషబ్ శెట్టిల విషయంలో రష్మిక మందాన చేసిన తాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.