చిత్రపరిశ్రమలో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ఏది మాట్లాడినా చర్చనీయాంశమే అవుతుంది. ప్లాప్స్ లో ఉన్నప్పుడు మాట్లాడితే పట్టించుకోరేమో.. కానీ, హిట్స్ ఉండి, స్టార్స్ సరసన సినిమాలు చేసేటప్పుడు ఏం మాట్లాడినా పరిగణలోకి తీసుకుంటారు ఫ్యాన్స్, నెటిజన్స్. కొన్నిసార్లు పాజిటివ్ ఉద్దేశంతో చేసిన కామెంట్స్ కూడా ఫ్యాన్స్ వరకు వెళ్లేసరికి నెగిటివ్ గా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందాన మాటలు కూడా సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ప్రెజెంట్ రష్మిక సూపర్ ఫామ్ గురించి చెప్పే అవసరం లేదు. కిరాక్ పార్టీ, ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప సినిమాలతో హిట్స్ తో దూసుకుపోతుంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక.. తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ లో సైతం అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా తమిళంలో కార్తీ, దళపతి విజయ్ ల సరసన నటించి సాలిడ్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసుకుంది. ఇక దళపతి విజయ్ తో నటించిన వారసుడు మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైంది. మిక్సెడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. విజయ్ క్రేజ్, థమన్ సాంగ్స్ తో భారీ అంచనాలు సెట్ చేసుకొని కలెక్షన్స్ అదరగొడుతోంది. అయితే.. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక ఉన్నట్లే గాని, ఆమె క్యారెక్టర్ కి పెద్దగా ప్రాధాన్యత లేదని, కేవలం సాంగ్స్ వరకే పరిమితం అయ్యిందని కామెంట్స్ బయటికి వచ్చాయి.
ఈ నేపథ్యంలో రష్మిక వారసుడు సినిమాలో తన క్యారెక్టర్ గురించి మీడియా ముఖంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. రష్మిక మాట్లాడుతూ.. తనకు హీరో విజయ్ అంటే పిచ్చి అని.. ఎప్పటికైనా అయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలని భావించానని చెప్పింది. అందుకే వారసుడులో నా క్యారెక్టర్ కి స్కోప్ లేకపోయినా చేశానని చెప్పిందట. అలాగే తాను ఈ సినిమా చేసినందుకు రిజల్ట్ సంతృప్తి పరిచినట్లు చెప్పుకొచ్చిందని సినీవర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’, రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’ సినిమాలు చేస్తోంది రష్మిక. మరి హీరో క్రేజ్ తో సినిమాలు ఆడతాయని, స్కోప్ లేని క్యారెక్టర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్స్ లో మీ అభిప్రాయాలు తెలపండి.