సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు మీడియా సమావేశాలలో టంగ్ స్లిప్ అవుతుంటారు. అది అనుకోకుండా జరిగినప్పటికీ.. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ, మీడియాలో మాత్రం నెగటివ్ వార్తలు, కథనాలు పుట్టుకొచ్చేస్తుంటాయి. హీరోలు, హీరోయిన్లు మీడియా సమావేశాలలో చేసే కామెంట్స్ ఒక్కోసారి ఎంతటి ట్రోలింగ్ కి గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విధంగా ట్రోల్స్ కి గురైన సెలెబ్రిటీలను మనం చూస్తూనే ఉన్నాం. కొందరు దిగివచ్చి మీడియా ముఖంగా క్షమాపణలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడీ లైన్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన వచ్చి చేరింది. గతంలో ఓ స్టార్ కన్నడ హీరోపై చేసిన కామెంట్స్ కారణంగా ట్రోల్స్ కి గురై ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరీ ఫ్యాన్స్ ని క్షమాపణలు అడిగింది. అయితే.. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రష్మిక స్టార్ హీరోయిన్ కాదు. ఆ హీరో కూడా కన్నడ వరకే స్టార్. ఇంతకీ రష్మిక కామెంట్స్ చేసిన హీరో ఎవరా అనుకుంటున్నారా? రాకింగ్ స్టార్ యష్ పై. 2017లో రష్మిక నటించిన కిరాక్ పార్టీ ప్రమోషన్స్ లో భాగంగా.. కన్నడ ఇండస్ట్రీలో ‘మిస్టర్ షోఆఫ్’ ఎవరు? అనే ప్రశ్నకు ‘యష్’ పేరు చెప్పింది.అంతే యష్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో రష్మికను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆ ట్రోలింగ్ భరించలేక రష్మిక సోషల్ మీడియా పోస్టులో యష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెబుతూ.. అసలు ఏం జరిగింది అనేది పేద్ద వివరణ ఇచ్చింది. యష్ సర్ ని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. వీడియో చూడకుండా అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎన్నోసార్లు నాకు యష్ సర్ స్ఫూర్తి అని చెప్పాను. అయన నటించిన ‘సంతూ స్ట్రయిట్ ఫార్వార్డ్’ మూవీ అంటే నాకు చాలా ఇష్టం.. అంటూ ఫ్యాన్స్ ని కూల్ చేసింది. మరి గతంలో జరిగిపోయిన ఈ ఇష్యూ ఇప్పుడెందుకు వెలుగులోకి వచ్చిందో.. కానీ ట్రెండ్ అయితే అవుతోంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం యష్ కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో సూపర్ స్టార్డమ్ తెచ్చుకొని పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మరోవైపు రష్మిక కూడా ఇటు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. మరి రష్మిక – యష్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.