యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర మీద మోస్ట్ గ్లామరస్ యాంకర్‌గా పేరు తెచ్చుకోవడమే కాక.. సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇక బుల్లితెర, వెండితెర మీద గ్లామర్ రోల్స్ చేస్తూ.. ఎలా కనిపించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. జంతు ప్రేమికురాలిగా కుక్కలు, ఆవులు, గేదెలు, కోళ్లు ఇలా మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతుంటుంది రష్మీ. ఈ భూమ్మీది ఏ ఒక్క జీవిని మనుషులు బాధ పెట్టినా వెంటనే రియాక్ట్ అయి దాన్ని ఖండించడం రష్మీ నైజం.
ఈ క్రమంలో రష్మీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన వారు రష్మీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉంది అంటే.. ఓ కుక్క మూతి డబ్బాలో చిక్కుకుని.. దాన్నుంచి బయటకు రాలేక తెగ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది గమనించిన వారు జంతు సంరక్షణ అధికారులుకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని కుక్కను కాపాడే ప్రయత్నం చేస్తారు.
ఇది కూడా చదవండి: Sona Mohapatra: సింగర్ కు స్టార్ హీరో ఫ్యాన్స్ వేధింపులు! లంచ్ బాక్స్ లో మలం పంపి..!
ఆ కుక్కని కాపాడటానికి హెల్ప్ చేస్తూ ఉంది ఆ టీమ్. ఇది ఒక అపార్ట్‌మెంట్ దగ్గర జరుగుతుంది. ఇది గమనించి.. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఒకాయన వచ్చి ఇక్కడ ఇలాంటివి చేయొద్దు వెళ్లిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు . ఈ సంఘటనపై రష్మీ చాలా బాధపడి అసహనం వ్యక్తం చేసింది. ఆ కుక్క మూతి డబ్బాలోంచి రాకపోతే ఏమి తినలేక ఆకలితో చచ్చిపోతుంది. కానీ ఈ అపార్ట్‌మెంట్‌లోని అంకుల్ మాత్రం యానిమల్ రెస్క్యూ టీంని అక్కడ నుంచి వెళ్ళిపోమంటూ అరుస్తున్నాడు. మూగ జీవి ఇబ్బందిలో ఉంటే ఆ అంకుల్ అలా అనడం కరెక్టేనా అంటూ ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Chinmayi Sripada: సరోగసి వార్తలపై స్పందించిన సింగర్ చిన్మయి!
ఏ మూగ జీవికి ఆపద వచ్చినా వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం ఇవ్వండి. వాళ్ళు వచ్చాక వాళ్ళ పనిని చేయనివ్వండి. ఈ అంకుల్ ప్రవర్తించినట్టు ఎవరూ చేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించింది రష్మీ గౌతమ్. ఇక నెటిజన్స్ కూడా రష్మీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: పూరీ జగన్నాథ్ చుట్టూ ర్యాంప్ లు, వ్యాంప్ లు మధ్యలో వచ్చారు: బండ్ల గణేష్!