బుల్లితెర మీద మోస్ట్ రొమాటింక్, లవబుల్ కపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుధీర్-రష్మీ జోడి. పదేళ్ల క్రితం ఈ జోడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏళ్లు గడుస్తున్న కొద్ది వారి మధ్య కెమిస్ట్రీ పెరుగుతూ వచ్చింది. ఒకానొక దశలో.. వీరద్దరూ నిజంగా లవర్స్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. ఆన్ స్క్రీన్ మీద మాత్రమే తాము అలా కనిపిస్తామని చెప్పుకొచ్చారు. అయినా సరే ప్రేక్షకులు మాత్రం.. వీరిద్దరిని నిజంగానే లవర్స్ అని భావిస్తారు. ప్లీజ్ మీరు పెళ్లి చేసుకొండి అని కామెంట్స్ చేస్తుంటారు. ఇక జబర్దస్త్ ఆర్టిస్టులు ఏ ఇంటర్వ్యూకు వెళ్లిన వాళ్లకు ఎదురయ్యే ముఖ్యమైన ప్రశ్నల్లో రష్మీ-సుధీర్ జోడి గురించి కచ్చితంగా అడుగుతారు. అది ఈ జోడికి ఉన్న క్రేజ్. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మీ.. సుధీర్ గురించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
తాజాగా రష్మీ, హీరో నందుతో కలిసి బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా ద్వారా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా హిట్ సాధించిన నేపథ్యంలో నందు-రష్మీలు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సుడిగాలి సుధీర్ గెస్ట్‌గా వచ్చాడు. దీనిపై యాంకర్ రోషన్.. సుధీర్‌ని మీరు పిలిచారా అని రష్మీని ప్రశ్నించాడు.
అందుకు రష్మీ బదులిస్తూ.. ‘‘సుధీర్‌ను పిలవాల్సిన అవసరం నాకు లేదు.. నేను పిలవకపోయినా తను వస్తాడు. మా మధ్య అలాంటి ఫ్రెండ్‌షిప్ ఉంది. అందుకే నేను తనను పిలవలేదు. తనకు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ తెలుసు.. పిలవకపోయినా వస్తాడని నాకు తెలుసు. కాకపోతే నందు.. సుధీర్‌ని పిలిచాడు’’అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. వీరద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో రష్మీ మాటలతో అర్థం అవుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.