ఫిల్మ్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. తాను సినిమా తీసినా.. మాట్లాడినా.. ట్వీట్ చేసినా.. ఏంచేసినా చివరకు అది వివాదాస్పదమే అవుతుంది. రాంగోపాల్ వర్మ కొన్ని కావాలని చేస్తే.. మకి కొన్ని అలా సన్సేషన్ అవుతుంటాయి. తన సినిమాలతో ఎంతో మంది నటీనటులకు స్టార్ డమ్ ఇచ్చిన రాము.. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ఇక ఆయన టార్గెట్ చేయని వారంటూ ప్రపంచంలో ఎవరూ లేరంటే అతియేశక్తి కాదేమో. కాదేది కవితకనర్హం అన్నట్లు.. వర్మ అనుకుంటే ఈ విశ్వంలో దేన్నైనా టార్గెట్ చేస్తాడు. మరలా చేయకపోతే ఆర్జీవీ ఎలా అవుతాడు చెప్పండి.
ఇక అసలు విషయానికి వస్తే.. రాంగోపాల్ వర్మ ఒక వ్యాపార సంస్థతో కలిసి ఈ మధ్య స్పార్క్ ఓటిటి మొదలు పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలతో తన ఓటీటీ స్పార్క్ ను ప్రమోషన్ కూడా చేస్తున్నాడు రాము. ఇక ఇప్పుడు స్పార్క్ ఓటీటీకి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రాంగోపాల్ వర్మ ప్రాణాళికలు సిద్దం చేశాడు. ఇందులో భాగంగా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను మొదలు పెట్టింది స్పార్క్ ఓటిటి సంస్థ. షార్ట్ ఫిలిమ్స్ మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పోటీలో పాల్గొనవచ్చు. కరోనా ధీమ్ పై రెండు నిముషాల నిడివి నుంచి అంతే కంటే తక్కువ నిడిగల షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించి పంపాలి. షార్ట్ ఫిలిమ్ తో పాటు తమ బ్యాంకు అకౌంట్ వివరాలను sparkshortz@gmail.com కు పంపాలని రాంగోపాల్ వర్మ చెప్పారు.
స్పార్క్ ఓటిటి సెలెక్ట్ అయిన ప్రతి షార్ట్ ఫిలింకు 10 వేల రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. అంతే కాదు వచ్చిన అన్నీ షార్ట్ ఫిల్మ్ లలోంచి టాప్ ఐదు ఫిలిమ్స్ ను ఎంపిక చేసి స్పార్క్ ఓటిటి కోసం సినిమా తీసే ఛాన్స్ ఇస్తామని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు మే 25 లోపు మీ షార్ట్ ఫిలిమ్స్ ను మెయిల్ చేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. సినిమాలపై ఆసక్తి ఉన్నావారు వెంటనే మీ కెమెరాను బయటకు తీయండి.. మీ సృజనాత్మతకు పదునుపెట్టండి.. ఆర్జీవీ సంస్థలో సినిమా ఛాన్స్ కొట్టేయండి.