ఎనర్టీటిక్ స్టార్ రామ్ పోతినేని, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున చిత్రం “ది వారియర్”. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. “ఇస్మార్ట్ శంకర్” తర్వాత రామ్ యాక్షన్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. కాగా ఈ సారి కొంచెం స్టైలిష్‌గా ఖాకి యూనిఫార్మ్ వేసుకుని విలన్‌లను చిత్తు చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా “ది వారియర్” సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని టాక్.
“ది వారియర్” మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సుమారు 2 గం.35 ని. ల రన్ టైమ్ కలిగి ఉందని టాక్. ఈ సినిమా.. ఇక థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. రామ్ ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో రేడియో జాకీ పాత్రలో కృతి శెట్టి కనిపించనుంది.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమూవీ పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ కి ఈ పాటలు బాగానే కనెక్ట్ అయ్యాయి. ఈసినిమా రామ్ కు వెరీ.. స్పెషల్. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇస్మార్ట్ హీరోతో పాటు.. ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి.. “ది వారియర్” కి యూ/ఏ సర్టిఫికేట్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.