టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఆదివారం ఎంతో అట్టహసంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని అభిమానులు కోరుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో అభిమానుల కాస్త తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఒక వైపు టీమిండియా ఓటమిపై కోహ్లీకి కొందరు ప్రముఖులు బాసటగా నిలుస్తూ ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. దీంతో పాటు మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ పాకిస్తాన్ ఆటగాళ్లతో నవ్వుతు పలకరించాడు.
దీంతో కోహ్లీ తీరుపై కొంత మంది ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం విరాట్ కోహ్లీ క్రీడాస్ఫూర్తిపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించారు. జట్టు ఓటమి పాలైన ప్రత్యర్థులతో నవ్వుతూ పలకరించటం నిజమైన క్రీడాస్ఫూర్తికి అద్దం పడుతుందంటూ కోహ్లీపై వర్మ ట్విట్టర్ స్పందించారు. ఇక ఎప్పుడు ఏదో అంశంలో వేలు పెడుతూ వివాదాలు సృష్టించే ఆర్జీవీ చాలా రోజుల తర్వాత ఇలా కూల్ గా ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Kudos to @imVkohli for praising the opponents in a true sportsman spirit instead of succumbing to false pride 💐💐💐💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2021