రకుల్ ప్రీత్ సింగ్.. ఈ భామకు ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మంచి ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లో అందరు టాప్ హీరోల సరసన నటించిన ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు కాస్త సన్నగిల్లాయనే చెప్పాలి. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సూపర్ క్రేజ్, ఫాలోయింగ్ ఈమె సొంతం. 2021లో డైరెక్టర్ క్రిష్ కొండపొలం సినిమా తర్వాత ఈ ఏడాది టాలీవుడ్ లో రకుల్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, హిందీలో మాత్రం ఈ ఒక్క ఏడాదిలోనే వెబ్ సిరీస్, సినిమాలు కలిపి 5 ప్రాజెక్టులు పూర్తి చేసింది.
సినిమాల సంగతి పక్కన పెడతే రకుల్ ఫ్యాన్స్ ప్రస్తుతం బాధలో ఉన్నారు. ఆమె చేసిన ఒక పోస్టు ఇప్పుడు ఫ్యాన్స్ ని ఏడిపించేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యింది. వారి ఇంట్లో ఒక అనుకోని ఘటన జరిగింది. అదే విషయాన్ని రకుల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. వారు 16 ఏళ్లుగా పెంచుకుంటున్న బ్లోసమ్ అనే పెంపుడు కుక్క కన్నుమూసింది. అది చనిపోయవడంతో రకుల్ ఎంతో ఎమోషనల్ అయ్యింది. బ్లోసమ్ తో దిగిన పిక్స్ ని షేర్ చేస్తూ తనతో ఆమెకున్న బంధాన్ని చెప్తూ కన్నీళ్లు పెట్టించింది.
“బ్లోసమ్ 16 ఏళ్ల క్రితం నువ్వు మా జీవితాల్లోకి అడుగుపెట్టావ్. అప్పటి నుంటి మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. మనిద్దరం కలిసే పెరిగాం. ఎలాంటి బాధ లేకుండా వెళ్లిపోయావు. రెస్ట్ ఇన్ పీస్.. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి” అంటూ రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు మంచు లక్ష్మి కూడా కామెంట్ చేసింది. “రెస్ట్ ఇన్ పీస్ బ్లోసమ్.. రకుల్ నాకు తెలిసినప్పటి నుంచి బ్లోసమ్ కూడా నాకు తెలుసు” అంటూ కామెంట్ చేసింది. ఇంకా అభిమానులే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీస్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు. RIP బ్లోసమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.