మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా బ్లాక్ బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాని దర్శకుడు బాబీ తెరకెక్కించాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. విడుదలైన ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలకపాత్ర పోషించాడు. ఇక సంక్రాంతి బరిలో రిలీజైన వీరయ్య.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రెండు వారాల్లోనే దాదాపు రూ. 250 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసుకొని.. రూ. 40 కోట్లకు పైగా లాభాలు సాధించింది.
ఈ క్రమంలో తాజాగా వరంగల్ లో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. వీరయ్య టీమ్ తో రామ్ చరణ్, పలువురు ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో కమెడియన్ రచ్చ రవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ పై తనకున్న ఆవేదన, అభిమానాన్ని చూపిస్తూ.. యాంకర్ సుమపై కోప్పడుతూ ఫైర్ అయ్యాడు రవి. ఈ నేపథ్యంలో చిరంజీవి గురించి మాట్లాడుతూ రవి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అతని స్పీచ్ లో అభిమానం ఉన్నా.. అంత రియాక్షన్ అవసరం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
‘ఓరుగల్లు బిడ్డలారా! నా అన్న చిరంజీవి వచ్చాడు. అయన సినిమాలు చూసుకుంటూ తిరిగిన నేను కేవలం ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్నా. డైరెక్టర్ బాబీ నాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. అంజనా దేవికి ముగ్గురు కొడుకులైతే.. ఇకనుండి నాలుగో కొడుకుగా నన్ను నేను ప్రకటిస్తున్నా. ఆస్తులు కాదు.. నేనెప్పుడూ వారి వెంటే ఉంటాను. మెగాస్టార్ ని కలిస్తే చాలని అనుకున్నా.. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే ఛాన్స్ కూడా వచ్చింది. లైఫ్ కి ఇది చాలు.” అంటూ అరుస్తూ మాట్లాడాడు రచ్చరవి. ప్రస్తుతం వీరయ్య ఈవెంట్ లో రవి చేసిన రచ్చ హాట్ టాపిక్ గా మారింది. మరి రచ్చ రవి స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.