హీరో నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమా విజయాన్ని చిత్రబృందం అభిమానులతో కలిసి పంచుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో గ్రేట్ యాక్టర్ ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు. నారాయణమూర్తి.. సాయిపల్లివి యాక్టింగ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవిని చూస్తే అసలు హీరోయిన్ లాగే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సక్సెస్ మీట్ లో నవ్వులు పూయించాయి. ఆమెను మొదట ఫిదా సినిమాలో చూసినట్లు గుర్తు చేసుకున్నారు. తమిళ్ అమ్మాయి అయినా సాయి పల్లవి తెలుగు మాట్లాడిన తీరు మెచ్చుకోదగిందని పొగడ్తలతో ముంచెత్తారు. మరి, నారాయణమూర్తి.. సాయి పల్లవి గురించి ఏం మాట్లాడారో ఫుల్ కామెంట్స్ ఈ వీడియోలో చూసేయండి.
