‘యాంకర్ అనసూయ’ అంటే పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై యాంకర్ గా చేస్తూనే మరో వైపు వెండితెరపై తళుక్కుమంటోంది. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అనసూయ ఎప్పడూ ముందుంటుంది. గర్భిణిగా ‘థ్యాక్యూ బ్రదర్’ సినిమాలో అనసూయ నటన అందరినీ కట్టిపడేసింది. రంగస్థలంలో రంగమ్మ అత్త పాత్రను ఎప్పటికీ మర్చిపోలేం.
రంగమ్మత్తకు పూర్తి భిన్నంగా పుష్ప చిత్రంలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ కనిపించబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను సుకుమార్ విడుదల చేశారు. ఈ లుక్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. పుష్పలో అనుసూయ.. దాక్షాయణిగా ప్రతినాయకి పాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది. రంగమ్మత్తగా పాపులర్ అయిన అనసూయ కోసం మరోసారి గుర్తుండిపోయే పాత్రను సుకుమార్ డిజైన్ చేశాడని అంటున్నారు. దాక్షాయణి లుక్స్‌తోనే సుకుమార్ ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో ఒక క్లారిటీ ఇచ్చాడు. లేడీ విలన్ తరహాలో పాన్ నములుతూ.. అడకత్తెర పట్టుకున్న అనసూయను చూసి అందరూ అవాక్కయ్యారు. కొందరైతే తెలంగాణ శకుంతల చేసిన లేడీ విలన్ పాత్రల తరహా ఉండబోతోందని భావిస్తున్నారు.
#Dakshayani 🙏🏻 #PushpaTheRise https://t.co/wMnxVPKzzF
— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 10, 2021