గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ఒక మాస్ ఫీస్ట్ ని అందించారు. లూసిఫర్ సినిమాని రీమేక్ చేసిన మోహన్ రాజా ఎక్కడా మాతృకని చెడగొట్టకుండా మెగా మాస్ ఎలివేషన్స్ తో సినిమాని ఇరగదీశారు. కలెక్షన్స్ పరంగానూ గాడ్ ఫాదర్ దూసుకుపోతోంది. ఈ సినిమాలో చేసిన అందరికీ ఎంతో మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సత్యదేవ్, నయనతార, పూరీ జగన్నాథ్ పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ అయితే తనకు ఎంతో ఇష్టమైన చిరంజీవి సినిమాలో విలన్ రోల్‌లో నటించాడు. ఇంక చిరంజీవికి గొప్ప అభిమాని అయిన పూరీ కూడా తన కలను నెరవేర్చుకున్నాడు.
గాడ్ ఫాదర్ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే పూరీ జగన్నాథ్ సినిమాలో జర్నలిస్ట్ పాత్ర వేశాడు. ఇప్పుడు అదే పాత్ర తరహాలో చిరంజీవిని ఇంటర్వ్యూ చేయించినట్లుగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఇద్దరూ ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో దాదాపు గంటసేపు మాట్లాడుకున్న చిరు-పూరీ ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. గాడ్ ఫాదర్ సినిమా గురించి పూరీ జగన్నాథ్ ప్రేక్షకులు, ఫ్యాన్స్ తలుసుకోవాలి అనుకున్న అన్ని విషయాలను ప్రశ్నల రూపంలో అడిగి సమాధానాలు రాబట్టాడు. ఆ సందర్భంగానే సత్యదేవ్- చిరంజీకి ఎంత గొప్ప అభిమానో అందరికీ తెలిసింది.
అయితే చివర్లో మెగాస్టార్ చిరంజీవీ- పూరీజగన్నాథ్‌కు ఓ ప్రశ్న సంధించారు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. “లైఫ్ లో హీలింగ్ టైమ్ తక్కువ ఉండాలి సార్. యుద్ధాలు జరిగినా, ప్రాణాలు పోయినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఎక్కువ ఉండకూడదు. వేరే పనిలో పడిపోవాలి. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాను. కానీ, సినిమా ఫ్లాప్ వచ్చింది. సినిమా ప్లాప్ అని వీకెండ్ వరకు కూడా ఆగాల్సిన పని లేకుండా పోయింది. నాకు ముందు శుక్రవారమే లైగర్ ప్లాప్ అని అర్థమైపోయింది. సండే జిమ్‌కి వెళ్లాను.. 10 స్కాట్స్ చేశాను.. నా స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు బాంబేలో కొత్త కథలు ప్రిపేర్ చేస్తున్నాను” అంటూ పూరీ జగన్నాథ్ లైగర్ ఫెయిల్యూర్‌పై స్పందించాడు.