సెలబ్రిటీలు అన్నాక కెమెరా ముందు ఏ విషయాన్నైనా ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా వేరే హీరోల గురించిఎం, వారి అభిమానుల గురించి మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడితే ఇంకా మంచిది. సరే ఎలాగో వినేవారు ఉన్నారు కదా అని నోరుజారితే.. ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వేరేలా ఉంటాయి. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో దర్శన్ విషయంలో ఇదే జరిగింది. హీరో దర్శన్ ఏ విషయమైనా నిర్మొహమాటంగా కెమెరా ముందే మాట్లాడేస్తుంటాడు. తన ఫ్యాన్స్ కి అవి సబబుగానే అనిపించవచ్చు.. కానీ, వేరే హీరోల ఫ్యాన్స్ హర్ట్ అయితే కాంట్రావర్సీలో ఇరుక్కోవడం ఖాయం.
మరి అసలు విషయం ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల అదృష్టదేవత గురించి దర్శన్ చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ‘అదృష్ట దేవత తలుపు తట్టినప్పుడు మనం ఆమెని గదిలోకి లాక్కెళ్లి నగ్నంగా మార్చాలి. అలా చేస్తే ఆమె ఇంట్లోనే ఉంటుంది. లేదా ఆమెను అలా చేయకపోతే ఇంటినుండి వెళ్లిపోతుంది’ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉండగా.. గతేడాది స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా ఫ్యాన్స్ నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. అదే పునీత్ ని తీసుకోండి. అతను చనిపోయిన తర్వాతే ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. కానీ.. నా విషయంలో నేను మాత్రం బతికుండగానే ఫ్యాన్స్ ప్రేమ పొందుతున్నా’ అని కాంట్రవర్సీకి తెరతీశాడు.
ఇక ఇప్పుడు దర్శన్ హీరోగా చేస్తున్న సినిమా ‘క్రాంతి’ అనే సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. ఇటీవల హోస్ పేటలో సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. హీరో దర్శన్ తోపాటు మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. ఓవైపు నటీనటులు స్టేజిపై మాట్లాడుతుండగా.. పక్కనే దర్శన్, పునీత్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న పునీత్ రాజ్ కుమార్ అభిమాని.. హీరో దర్శన్ పై చెప్పు విసిరాడు. ఈ సంఘటన చూసి అందరూ షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. అదృష్ట దేవతపై చేసిన వ్యాఖ్యల వల్లే ఈ సంఘటన జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే చర్చలు జరుగుతుండగా.. ఈ విషయంపై స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ తో పాటు ధన్వీర, రాజవర్ధన్ లాంటి పలువురు స్టార్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మరి దర్శన్ విషయంలో పునీత్ ఫ్యాన్ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.
😣💔#WeStandWithDbosspic.twitter.com/zHXZhue0v9
— GODZILLA (@NTR_AA_GODZILLA) December 19, 2022
No filter pic.twitter.com/tliTlJ87Or
— ಟ್ರೋಲ್ ಹೈಕ್ಳು (@TrollHaiklu) December 8, 2022
ನೆನ್ನೆ ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ದರ್ಶನ್ ಅವರ ಮೇಲೆ ನಡೆದ ಕೃತ್ಯ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ನೋವುಂಟು ಮಾಡಿದೆ. ಈ ರೀತಿಯ ಅಮಾನವೀಯ ಘಟನೆ ಒಂದೇ ಮನೆಯವರಂತಿರುವ ಎಲ್ಲರಿಗೂ ನೋವುಂಟು ಮಾಡುತ್ತದೆ.
ಮನುಷ್ಯತ್ವ ಮರೆತು ಯಾರೂ ಈ ರೀತಿಯ ಕೃತ್ಯಗಳನ್ನು ನಡೆಸಬಾರದು ಎಂದು ವಿನಂತಿಸುತ್ತೇನೆ
ಅಭಿಮಾನದಿಂದ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿ; ದ್ವೇಷ ಅಗೌರವವನ್ನಲ್ಲನಿಮ್ಮ
ಶಿವಣ್ಣ pic.twitter.com/34eJfpdmKk— DrShivaRajkumar (@NimmaShivanna) December 19, 2022