నటి శరణ్య పొన్నవనమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రఘువరన్ బీటెక్ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాత్రగా ఆమె చనిపోయినా.. అమ్మగా అందరి మనుషుల్లో నిలిచిపోయారు. ‘‘ అమ్మ, అమ్మ.. నే పసివాడ్నమ్మా’’ అనే పాట ఎప్పుడు విన్నా.. శరణ్యే గుర్తుకు వస్తుంది. అంతలా తన పాత్రతో జనం మనసులోకి ఎక్కారామె. శరణ్య తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాప్‌లో ఉన్నారు. ఆ హీరో, ఈ హీరో అని లేకుండా అందరు హీరోలతో ఆమె పని చేశారు. తల్లి పాత్ర ఏదైనా ఉంటే మొదట శరణ్యనే ముందు సంప్రదిస్తున్నారు దర్శక, నిర్మాతలు. కేవలం తమిళంలోనే కాదు..
తెలుగులోనూ శరణ్య మంచి మంచి సినిమాలు చేశారు.. చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న అరువ సండ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా, సినిమా బృందం ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళ నిర్మాత రాజన్ శరణ్యపై సంచలన కామెంట్లు చేశారు. ఆమె చిన్న సినిమాలను పట్టించుకోవటం లేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాజన్ మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమాలో శరణ్యది హీరోయిన్ కంటే ముఖ్యమైన పాత్ర. అందుకే ఆమెను ఆడియో ఫంక్షన్‌కు రావాల్సిందిగా బ్రతిమాలాము.
అయినా కూడా ఆమె రాలేదు. ఇదే పెద్ద నిర్మాత సినిమా అయితే, ఆమె అలా చేస్తుందా? కొత్త నిర్మాతలను తొక్కేసే ప్రయత్నం చేయకూడదు’’ అని అన్నారు. కాగా, శరణ్య మణిరత్నం దర్శకత్వం వహించిన నాయకన్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1988లో వచ్చిన నీరాజనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 100కుపైగా సినిమాల్లో చేశారు. ఆమె ప్రస్తుతం తెలుగులో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నారు. మరి, ప్రముఖ నటి శరణ్యపై నిర్మాత ఫైర్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.