టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అనగానే చాలామంది చెప్పే పేరు దిల్ రాజు. దాదాపు 50 సినిమాలు తీసిన ఆయన.. ఇటీవల సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో వారసుడిని కన్నారు. అవును.. చాలా సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజు.. ఈ మధ్య కాలంలో వార్తల్లో తరచుగా కనిపిస్తున్నారు. అయితే అవన్నీ కూడా సినిమాలు, రిలీజ్ వివాదాలు వాటి గురించి. అయితే ఇప్పుడు మాత్రం తన లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
ఇక విషయానికొస్తే.. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన వెంకట రమణారెడ్డి, దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారారు. తన పేరు కూడా రాజుగా మార్చుకున్నారు. అలా తొలి సినిమాతో హిట్ కొట్టి.. దిల్ రాజు అయిపోయారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అందరూ స్టార్ హీరోలతోనూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత.. 2017లో అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆ తర్వాత 2020లో లాక్ డౌన్ టైంలో తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఆమె పేరుని వైఘారెడ్డిగా మార్చారు. అందరూ ఇది పెద్దల కుదుర్చిన పెళ్లి అని అనుకున్నారు. కానీ ఇందులో లవ్ స్టోరీ ఉందని తెలిసింది. ఆ విషయాన్ని స్వయంగా దిల్ రాజునే బయటపెట్టారు.
‘నా భార్య అనిత చనిపోయిన తర్వాత రెండేళ్లు కష్టాలు అనుభవించాను. అప్పటికే నాకు 47 ఏళ్లు. జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలనుకుంటున్న టైంలో రెండు మూడు ఆప్షన్స్ వచ్చాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకున్నాను. అలా నేను విమానంలో జర్నీ చేసే టైంలో తేజస్విని పరిచయమైంది. నాకు నచ్చడంతో ఫోన్ నంబర్ తీసుకుని దాదాపు ఏడాదిపాటు ఆమెని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ప్రపోజ్ చేశాను. ఆమెకు నచ్చడంతో ఆమె ఫ్యామిలీతో డిస్కషన్ జరిగింది. చివరకు పెళ్లి వరకు వెళ్లింది. తేజస్వినిలో నాకు బాగా నచ్చిన విషయం ఆమె చాలా గ్రౌండ్ టూ ఎర్త్ ఉంటుంది’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఇక తేజస్విని.. తనకు దిల్ రాజు ఎలా పరిచమయ్యారనే విషయాన్ని ఇదే ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ‘నేను ఎయిర్ లైన్స్ లో పనిచేసేదాన్ని. కొన్నాళ్లలో అమెరికా వెళ్లి పీజీ చేయాలనుకున్నా. అలాంటి టైంలో ఈయన(దిల్ రాజు) మా ఎయిర్ లైన్స్ లో రెగ్యులర్ గా ట్రావెల్ చేసేవారు. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఫస్ట్ టైం పెన్ అడిగారు. ఆ తర్వాత నేను షిఫ్ట్ లో ఉన్నప్పుడు తరుచూ విమానంలో కనిపించేవారు. అలా మా మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమ వరకు వెళ్లి, పెళ్లికి దారి తీసింది’ అని తేజస్విని అలియాస్ వైఘారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక దిల్ రాజు లవ్ స్టోరీ కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ క్యూట్ ప్రేమకథ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.