ప్రియాంక సింగ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ లో లేడీ గెటప్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత జెండర్ మార్చుకుని అమ్మాయిగా మారిపోయింది. హీరోయిన్లు సైతం కుళ్లుకునే అందం ఆమె సొంతం అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తుంటారు. నిజానికి ఆమె అంత క్యూట్‌గా ఉంటుంది. బిగ్ బాస్ షో ఆమె కెరీర్‌నే మార్చేసింది అని చెప్పొచ్చు.
బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యాక ఆమెకు సెలబ్రిటీ హోదా వచ్చింది. అంతేకాకుండా ఆమె జెండర్ మార్చుకున్న విషయాన్ని బిగ్ బాస్ స్టేజ్ ద్వారా ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లు ఆమెకు అంగీకరించడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్‌లో మానస్ కు దగ్గరగా ఉంటూ అతనిపై ఇష్టాన్ని పెంచుకుంది. మొత్తానికి బిగ్ బాస్ ఆమె లైఫ్ మొత్తాన్ని మార్చేసిందనే చెప్పాలి.
బిగ్ బాస్ తర్వాత కూడా అడపాదడపా షోలు, డాన్సులు, స్కిట్లలో కనిపిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇంక సోషల్ మీడియా విషయానికి వస్తే ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు అయితే పెద్ద చర్చకే దారి తీశాయి. అవేంటంటే హల్దీ ఫంక్షన్ ఫొటోలు అనమాట అవి.
అయితే అవన్నీ చూసి అభిమానులు ప్రియాంక సింగ్‌కు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే అది నిజంగా పెళ్లికి సంబంధించిన ఫంక్షనా? లేక ఏదైనా పూజ సందర్భంగా అలా చేశారా? అనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఫ్యాన్స్ మాత్రం ప్రియాంక సింగ్ కు పెళ్లి ఫిక్స్ అయిందంటూ సంబరపడిపోతున్నారు. మొత్తానికి కుటుంబంతో కలిసి ఆమె ఆనందంగా గడుపుతున్న పిక్స్ అయితే వైరల్ అవుతున్నాయి.
గతంలో కూడా ఒకసారి ఇలా ప్రియాంక సింగ్‌కు పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. అవి బాగా వైరల్ కావడంతో వాటిపై స్వయంగా ప్రియాంక సింగ్ స్పందించింది. ఆమె ఆ సమయంలో ‘నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి?’ అంటూ రివర్స్ లో అభిమానులకు ప్రశ్నలు సంధిచింది. అయితే ఇది కూడా ఏదైనా స్పెషల్ షూట్ గానీ, లేదా ఏదైనా పూజ కావచ్చు అంటున్నారు. ప్రియాంక సింగ్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.