‘సర్కారు వారి పాట’ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన సర్కారు వారి పాట.. తర్వాత అగ్రదర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్నాడు మహేష్. ప్రస్తుతం ‘SSMB28‘ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. మరోసారి మహేష్ సరసన స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే రొమాన్స్ చేయనుంది.
అతడు, ఖలేజా తర్వాత భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ కూడా దర్శకుడు త్రివిక్రమ్ పకడ్బందీగా రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో విలన్ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ని సంప్రదించినట్లు సమాచారం. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలలో విలన్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటారు.
ఆ విధంగానే టీమ్ పృథ్వీరాజ్ ని ఎంపిక చేసే పనిలో పడిందేమోనని టాక్. అయితే.. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్ వారు సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. మరి మహేష్ కి విలన్ గా పృథ్వీరాజ్ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#MaheshBabu Malayalam super star #PrithvirajSukumaran As runner to play Baddie in #SSMB28 mass rampage 🔥 pic.twitter.com/QvbElzLfQq
— ManuSpeaks ⭐ (@KManoha90753535) May 30, 2022