సాధారణంగా హిట్ సినిమాలు తీసినప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో.. ఒక్క ఫ్లాప్ మూవీ తీస్తే అంతకంటే ఎక్కువగా విమర్శిస్తారు, ట్రోల్స్ చేస్తారు. అయితే అలాంటి విమర్శలను కొంత మంది డైరెక్టర్లు పాజిటీవ్ గా తీసుకుని ముందుకుపోతారు. మరికొంతమంది తిరిగి ఆడియన్స్ పైనే ఫైర్ అవుతుంటారు. ఇలాంటి సంఘటనలు మనం ఇండస్ట్రీలో చాలానే చూశాం. తాజాగా తన సినిమా బాగోలేదని ప్రేక్షకులు చేస్తున్న విమర్శలకు, ట్రోల్స్ కు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చాడు ఓ స్టార్ డైరెక్టర్. మీ అందరికి నన్ను, నా సినిమాలను విమర్శించే, ట్రోల్స్ చేసే హక్కు లేదు. నేను మీ బానిసను కాదు అని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు సదరు స్టార్ డైరెక్టర్.
ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు దర్శకుడిని ప్రశంసించడం, ఫ్లాప్ అయితే విమర్శించడం ఇండస్ట్రీలో సర్వసాధారణమే. అయితే ఆ విమర్శలను పక్కకు పెట్టి.. హిట్ సినిమా తీసి తనపై వస్తున్న విమర్శలకు ధీటైన జవాబు ఇవ్వడమే నిజమైన డైరెక్టర్ లక్షణం. ఇక ప్రస్తుతం ఓ స్టార్ డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చాడు ఆ డైరెక్టర్. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆల్ఫనోస్ పుత్రన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ ఒక్క సినిమాతోనే దర్శకుడు ఆల్ఫనోస్ పుత్రన్ కు స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది. అయితే ప్రేమమ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. ఇటీవలే ‘గోల్డ్’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీలో నయనతార, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోల్డ్ చిత్రం.. డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఆడియన్స్ డైరెక్టర్ ఆల్ఫోనోస్ పుత్రన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విమర్శలపై కాస్త ఘాటుగానే స్పందించాడు ఈ స్టార్ డైరెక్టర్. సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీ స్టేట్ మెంట్ ను పోస్ట్ చేశాడు ఆల్ఫోనోస్. ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు డైరెక్టర్.. “నా సినిమాలను, నన్ను విమర్శించే హక్కు మీకు( ఆడియన్స్) లేదు. నన్ను కామెంట్ చేసే, విమర్శించే హక్కు ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క కమల్ హాసన్ మాత్రమే. నేను మీ బానిసను కాదు. మీకు నచ్చితే నా సినిమాలు చూడండి.. లేదా చూడకండి. సోషల్ మీడియాలో ఇలా విమర్శలకు దిగితే.. నేను సోషల్ మీడియాలో ఇక నా మెుహం మీకు చూపించకుండా ఇలా నిరసన తెలుపుతా” అని ఆల్ఫోనోస్ పుత్రన్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తన ఫేస్ బుక్ ఫ్రొఫైల్ పిక్ ను మర్చుకున్నాడు. ఈ పోస్ట్ పై మళ్లీ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజనులు. అలా ఐతే నువ్వు తీసే సినిమాలు కమల్ హాసన్ కు మాత్రమే చూపించుకో అని వ్యంగ్యంగా సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. మరి ప్రేమమ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.