ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తోన్న చిత్రం ఆదిపురుష్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో టి.సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా పేరు ప్రకటించిన నాటి నుంచే దానిపై అంచనాలు పెరుగుతూ వస్తోన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీతాగా నటిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఓ చిన్న అప్‌డేట్ కూడా లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఎట్టకేలకు ‘ఆది పురుష్’ టీమ్ తమ సినిమా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టేసింది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా టీజర్‌ను రామ జన్మభూమి అయోధ్యలో విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ.. తాజాగా ఆదిపురుష్ టీజర్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనిలో ప్రభాస్ విల్లు ఎక్కుపెట్టిన రాముడిలా ఉన్న లుక్ అద్భుతంగా ఉంది. ఈ టీజర్ వచ్చిన దగ్గర నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. ఇక టీజర్ రిలీజ్ అయ్యాక వారిని ఆపడం ఎవరి తరం కాదంటున్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్‌తో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాతి బరిలో విడుదల కానుంది. 3డీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులను ముందుకు రానుంది.
‘ADIPURUSH’ TEASER POSTER IS HERE – TEASER LAUNCH ON 2 OCT… Team #Adipurush unveils *teaser poster*… #AdipurushTeaser arrives on 2 Oct [Sun]… Stars #Prabhas, #SaifAliKhan, #KritiSanon and #SunnySingh… Directed by #OmRaut.#AdipurushMegaTeaserReveal #AdipurushInAyodhya pic.twitter.com/1WTct5d4yo
— taran adarsh (@taran_adarsh) September 30, 2022