కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి (43) అలియాస్ రవి ప్రసాద్ కన్ను మూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని బీజీఎస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య, కొడుకు ఉన్నారు. ప్రముఖ నాటక రచయిత, టీవీ రైటర్ డాక్టర్ హెచ్ఎస్ ముద్దుగౌడ కుమారుడు ఈ మాండ్య రవి. కన్నడలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో కూడా పలు సీరియల్స్ లో నటించారు. దర్శకుడు టీఎస్ నాగాభరణ తెరకెక్కించిన ‘మహామయి’ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రవి ప్రసాద్.. మించు, ముక్త ముక్త, మగలు జానకి,చిత్రలేఖ, యశోదే, వరలక్ష్మి స్టోర్స్ వంటి పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈయన ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేశారు. అంతేకాదు ‘లా’ కూడా చదివారు. కానీ ఈయన నటుడిగా కెరీర్ ప్రారంభించారు. మగలు జానకి సీరియల్ లోని చందు బర్గి పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించిన రవి మాండ్యా.. పలు సినిమాల్లో కూడా నటించారు. టీఎన్ సీతారామ్ డెబ్యూ డైరెక్టర్ సినిమా ‘కాఫీ తోట’లో కూడా నటించారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కుటుంబ సభ్యులు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. రవి మాండ్యాకు సద్గతులు ప్రాప్టించాలని కోరుకుందాం. ఓం శాంతి.