ఈ మద్య వెండితెర, బుల్లితెర నటీమణులు తమ మాతృత్వపు ఆనందాన్ని పదిలంగా గుర్తుంచుకోవాలని ఉద్దేశంతో బేబీ బంప్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది.
ఇటీవల మాతృత్వ ఆనందాన్ని గొప్పవరంగా భావిస్తూ.. ఆ జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో బేబీ బంప్ స్టిల్స్ ని సంతోషంగా షేర్ చేస్తున్నారు. ఇలా తమ ఆనందాన్ని పంచుకోవడానికి వెండితె, బుల్లితెర నటీమణులు ఎంతో ఉత్సామాన్ని చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది ఒక ట్రెండ్ గా మారింది.. బేబీ బంప్ కి చెందిన ఫోటో షూట్స్ ఎప్పుడూ గుర్తుండిపోయేలా, ప్రత్యేకమైన డ్రెస్సింగ్ తో పలువురు నటీమణులు రక రకాల స్టిల్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా అందాల నటి పూర్ణ బేబీ బంప్ కి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నటి పూర్ణ ఈమె అసలు పేరు షామ్నా కాసీం. కేరళా లో మోడల్ గా కెరీర్ ఆరంభించిన నటిగా మారింది. శాస్త్రీయ నృత్య కళాకారిణిగా మంచి పేరు సంపాదించుకుంది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హరర్ మూవీ అవును, అవును 2 లో నటించి తెలుగు ప్రేక్షకుల బాగా దగ్గరయ్యింది. ప్రస్తుతం నటిగా కొనసాగుతూనే పలు టివీ షోల్లో జడ్జీగా వ్యవహరిస్తుంది. గత ఏడాది దుబాయ్ చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుంది. ప్రస్తుతం నటి పూర్ణ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నానని.. త్వరలో అమ్మగా నాకు ప్రమోషన్ రాబోతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.
ఈ నేపథ్యంలో మోడ్రన్ డ్రెస్ పింక్ ఫ్రాక్ లో షేర్ చేసిన బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నటి పూర్ణ తల్లి కాబోతున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా శ్రీమంతం నిర్వహించారు.. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా పలువురు సినీ, బుల్లితెర నటీనటులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన పూర్ణ తెలుగు లో అల్లరి నరేష్ నటించిన ‘సీమ టపాకాయ్’ చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే సిల్లీ ఫెలోస్, దృశ్యం 2, అఖండ మూవీలో నటించింది.
నటిగా ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా పూర్ణ దుబాయ్ కి చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫౌండర్, సీఈఓ షానీద్ ఆసీఫ్ అలీని వివాహం చేసుకుంది. కొంత కాలంగా వీరిద్దరి మద్య ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి సందర్భంగా ఆమెకు ఆసీఫ్ అలీ కొన్ని కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వీటితో పాటు దుబాయ్ లో ఓ లగ్జరీ ఇల్లు కూడా కొనిపించాడని.. ఎన్నో విలువైన కార్లు, కంపెనీలో షేర్లు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా పింక్ డ్రెస్ లో అందాల నటి పూర్ణ బేబీ బంప్ పిక్స్ వైరల్ గా మారాయి.