రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘మాఊరి పొలిమేర 2’ టీజర్ అంచనాలు పెంచేసింది. ఫస్ట్ పార్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా, అంతకుమించి అనేలా ఉంది టీజర్. మొదటి భాగంలోని పాత్రలను కూడా చూపించి కొనసాగింపు సరికొత్తగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు.
గతంలో క్షుద్ర పూజల నేపథ్యంలో తెలుగులో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను భయపెట్టాయి. రాజేంద్ర ప్రసాద్ ‘కాష్మోరా’ నుండి ఇటీవల వచ్చిన సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ వరకు ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇదే బ్యాక్‌డ్రాప్‌లో, ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైంది సూపర్ సక్సెస్ అయింది ‘మాఊరి పొలిమేర’.. డిఫరెంట్ కథ, కథనాలతో ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేశారు టీం. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శ్రీను, రవి వర్మ తదితరులు నటించిన ఈ ఫిలిం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఉత్కంఠతకు గురి చేస్తుంది. దీంతో దీని సీక్వెల్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శుక్రవారం (జూన్ 30) ‘మాఊరి పొలిమేర 2’ టీజర్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా, అంతకుమించి అనేలా ఉంది టీజర్. మొదటి భాగంలోని పాత్రలను కూడా చూపించి కొనసాగింపు సరికొత్తగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ‘ప్రాణం తీసుడు తప్పు కదా మామా’.. అంటే, ‘ప్రాణం తీస్తే తప్పు కానీ, బలిస్తే తప్పేంది?’ అనే ఒక్క డైలాగ్ మాత్రమే పెట్టారు. ఇక టీజర్ చివర్లో క్షుద్ర పూజలు చేస్తూ తలపై రక్తం పోసుకుంటున్న సత్యం రాజేష్ క్యారెక్టర్ చూస్తే భయంతో పాటు గూస్ బంప్స్ కూడా వస్తాయి. డా. అనిల్ విశ్వనాథ్ డైరెక్టర్. గౌరికృష్ణ నిర్మాత. ‘మాఊరి పొలిమేర 2’ జూలై నెలాఖరులో లేదా ఆగస్టులో విడుదల కానుందని తెలిపారు టీం.