హలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు సీనియర్ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు కన్నుమూశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ గవర్నర్ మిస్టర్ స్కాట్ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ మరణించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, తెలుగు, తమిళ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన శరత్ బాబు తుది శ్వాస విడిచిన సంగతి విదితమే.. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు తుది శ్వాస విడిచారు.
వరుస మరణాలు సినీ పరిశ్రమను కోలుకోకుండా చేస్తున్నాయి. హలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు సీనియర్ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు కన్నుమూశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ గవర్నర్ మిస్టర్ స్కాట్ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ మరణించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, తెలుగు, తమిళ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన శరత్ బాబు తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. తాజాగా ప్రముఖ మళయాళ నటుడు హారీష్ పెంగన్ మరణించారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట విషాదం నెలకొన్న సంగతి విదితమే. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మరో నటుడు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తూ.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
హాలీవుడ్ ప్రముఖ నటుడు సెర్గియా కాల్డెరాన్ ఇక లేదు. ప్రస్తుతం ఆయన వయస్సు 77 సంత్సరాలు. 1945లో జన్మించిన అతడు. 1970వ దశకం నుండి సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. సినిమాలు, టీవీ షోల్లో పలు పాత్రలు పోషించారు. 1984లో జాన్ హస్టన్ దర్శకత్వం వహించిన ‘అండర్ ది వాల్కనో’, టీవీషో ‘ది ఎ-టీమ్’, కామెడీ సిరీస్ ‘ది ఇన్-లాస్’లో నటించారు. కానీ అతడిని పేరు తెచ్చినవి మాత్రం మెన్ ఇన్ బ్లాక్, పైరేట్స్ ఆఫ్ ద కరేమియన్. ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్- ఎట్ వరల్డ్స్ ఎండ్’.ఆ సినిమాలో పైరేట్ లార్డ్స్‌లో ఒకరైన అడ్రియాటిక్ సముద్రానికి చెందిన కెప్టెన్ ఎడ్వర్డో విల్లాన్యువా పాత్రను పోషించాడు. ది రివెంజర్స్ (1972), ది చిల్డ్రన్ ఆఫ్ శాంచెజ్ (1978), లే చెవ్రే (1981), ఓల్డ్ గ్రింగో (1989), ది మిస్సింగ్ (2003), ది రూయిన్స్ (2008) వంటి చిత్రాలు ఉన్నాయి. గత ఏడాడది ఎఫ్ఎక్స్ సిరీస్ బెటర్ థింగ్స్ చివరి సీజన్‌లో కూడా కనిపించారు. అతనికి భార్య, కొడుకు, కుమారుడు, ముగ్గురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.