ఈ మధ్య గ్లామర్ షో విషయంలో హీరోయిన్స్ అంతా హద్దులేవీ పెట్టుకోవడం లేదు. సంప్రదాయ చీరకట్టుకు తక్కువ ప్రాధాన్యతనిస్తూ.. మోడరన్ దుస్తులను ఎక్కువగా ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. సరే గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి.. ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో తప్పులేదు. కానీ.. అందాలను షో చేయడంలో హద్దులు మీరుతున్నాయి అనేది ఫ్యాన్స్ వాదన.
ఇక కెరీర్ ప్రారంభంలో లంగావోణీ, చీర, పంజాబీ డ్రెస్సులలో ఆకట్టుకున్న వయ్యారి భామలు.. ఒక్కసారిగా స్కిన్ షో చేస్తే షేక్ అయిపోతారు ఫ్యాన్స్. అలాంటిది ఏకంగా బీచ్ లో బికినీ వేసి దర్శనమిస్తే ఏంటి పరిస్థితి.. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన అభిమానులు. అందుకు కారణం.. తాజాగా రష్మిక మాల్దీవ్స్ బీచ్ లో చేసిన ఫోటోషూట్.
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరూ.. పుష్ప.. ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది. పుష్ప క్రేజ్ తో ఏకంగా బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలను చేజిక్కించుకుంది రష్మిక.
ఇక బాలీవుడ్ లో సౌత్ హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో తెలిసిందేగా.. అవును.. బాలీవుడ్ హీరోయిన్స్ ని మించి అందాలను ఆరబోయడం నేర్చుకుంది. సౌత్ లో ఎక్కడికి వెళ్లినా నిండైన డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేసే రష్మిక.. బాలీవుడ్ లో మాత్రం అదే పనిగా పొట్టిపొట్టి నిక్కర్లు, టాప్ టు బాటమ్ అందాల విందు చేయడం చూస్తూనే ఉన్నాం.
ఇటీవల అమ్మడు మాల్దీవ్స్ టూర్ కి వెళ్లిన విషయం విదితమే. అదికూడా విజయ్ దేవరకొండతో వెళ్లిందని టాక్ నడుస్తుంది. మరి నిజం కాదేమో అనుకునేలోపే.. ఎయిర్ పోర్ట్ వీడియో వచ్చేసింది. ఇదిలా ఉండగా.. మాల్దీవ్స్ లో రష్మిక, విజయ్ ఓ పాపులర్ మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం వెళ్లారని, డేట్ కోసం కాదని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో రష్మిక చేసిన కొత్త ఫోటోషూట్స్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో ఎన్నడూ చూడని రేంజిలో రష్మిక హాట్ షో చేసేసరికి.. ఫ్యాన్స్ అంతా నోరెళ్ళబెడుతున్నారు. బీచ్ లో ఊహించని విధంగా బికినీలో దర్శనమిచ్చింది అమ్మడు. పూరేకుల్లాంటి గోల్డెన్ డ్రెస్ లో రష్మిక టాప్ టు బాటమ్ అందాలు కుర్రాళ్లను నిద్రపోనిచ్చేలా లేవని చెప్పాలి.
మరోవైపు బ్లాక్ కలర్ టు పీస్ బికినీలో రష్మిక హాట్ ట్రీట్.. నెటిజన్స్ కి మతులు పోగొడుతోంది. అయితే.. రష్మికను బికినీ ఫోజులలో చూసి ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతుండగా.. అబ్బా ఏముందిరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు గ్లామర్ ప్రియులు. అయితే.. కొన్ని ఫోటోల వరకూ రష్మిక.. ఓ ట్రావెలింగ్ మ్యాగజైన్ కోసం షూట్ లో పాల్గొందని అర్థమవుతుంది.
ఇదిలా ఉండగా.. పుష్పతో పాన్ ఇండియా స్టార్డమ్, రెమ్యూనరేషన్.. లెవల్ అందుకున్న రష్మిక.. ఇటీవల అమితాబ్ పక్కన గుడ్ బై అనే సినిమా చేసింది. మరోవైపు త్వరలోనే పుష్ప-2 మూవీ షూట్ లో పాల్గొనబోతుంది. అలాగే దళపతి విజయ్ సరసన 'వారసుడు' అనే ద్విభాషా చిత్రం చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న రష్మిక.. ఆ క్రేజ్ ని, టైమ్ ని బాగా వాడుకుంటోందని సినీవర్గాలు చెబుతున్నాయి.