ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రకటించడంతో సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. సినిమాలను ఓటీటీలలో విడుదల చేయవద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలను హెచ్చరించింది. అయితే సినిమాకు పెట్టిన బడ్జెట్ అయినా రావాలంటే సరైన ధరకు చిత్రానికి ఎక్కడైనా విడుదల చేస్తామని ఇటు నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో థియేటర్లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటూ సినీ పరిశ్రమలో రచ్చ మొదలైంది. పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి ఓటిటీ ప్లాట్ ఫామ్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
‘భారత దేశంలో పేద వాడికి వినోదం లేదు, మధ్య తరగతి బడుగు వర్గాల ఇళ్లల్లో ఓ టి టి లేదు. మరి వాళ్ల కెప్పుడు ఇస్తారు వినోదమని ప్రశ్నించారు. విజయవాడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తీవ్రంగా స్పందించారు. ఓ టి టి లో రిలీజ్ అయిన హీరో వెంకటేష్ సినిమా ‘‘నారప్ప’’ తెలుగు రాష్ట్రాలలో కేవలం 25 శాతం మంది మాత్రమే చూశారని, మిగతా 75 శాతం మంది చూడలేకపోయారన్నారు.
‘సినిమా థియేటర్ లో సినిమా చూడడం ఒక పండుగ, థియేటర్ అనుభూతే వేర’ని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. కరోనా తో అందరూ ఫైట్ చెయ్యాల్సిందే.
‘పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం సినిమా థియేటర్., సినిమా బతకాలి., థియేటర్స్ బతకాలి., సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలని నారాయణమూర్తి కోరారు. మనిషి వున్నంత కాలం థియేటర్ వుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. థియేటర్లు లేకపోతే స్టార్ డమ్ లు వుండవ’న్నారు.
కరోనాతో అందరూ ఫైట్ చేయాల్సిందేనని, కానీ పేదవాడికి వున్న ఒకే ఒక్క వినోదం థియేటర్ అని నారాయణ మూర్తి మరోమారు ప్రకటించారు.