నరేష్-పవిత్ర లోకేష్ ల పెళ్లి వార్త నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా నరేష్-పవిత్ర జంట పెళ్లి జరిగిన వీడియోను రిలీజ్ చేసి సంచలనం రేపారు. ఈ క్రమంలోనే ఆ 1500 కోట్ల ఆస్తి కొట్టేయడానికే నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు పవిత్ర లోకేష్ మెుదటి భర్త సుచేంద్ర ప్రసాద్.
నరేష్-పవిత్రా లోకేష్.. గత కొంత కాలంగా టాలీవుడ్ లో తరచుగా వినిపిస్తున్న పేర్లు. ఇక ఈ జంట డేటింగ్ చేస్తూ.. పబ్లిక్ లో కలిసిమెలిసి తిరుగుతున్నా గానీ పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ మాత్రం వీరు ఇవ్వట్లేదు. దాంతో వీరిద్దరు ఎక్కడ కనిపించినా గానీ వీరి గురించే చర్చనడుస్తోంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నరేష్-పవిత్ర పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటిస్తూ.. ఓ లిప్ లాక్ వీడియోను సైతం వదిలింది ఈ ప్రేమ జంట. అయితే ఆ వీడియో నిజమైంది కాదని, ఓ సినిమా ప్రమోషన్ అని వార్తలు వచ్చాయి. ఈసారి నరేష్-పవిత్ర జంట పెళ్లి జరిగిన వీడియోను రిలీజ్ చేసి సంచలనం రేపారు. ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ మెుదటి భర్త సుచేంద్ర ప్రసాద్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ రూ. 1500 కోట్ల ఆస్తి కోసమే నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోంది అని బాంబులాంటి స్టేట్ మెంట్ ఇచ్చాడు.
నరేష్-పవిత్ర లోకేష్ ల పెళ్లి వార్తలు నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఇక వీరిద్దరు వివాహం చేసుకోవడానికే నరేష్ తన భార్య అయిన రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వడానికి సిద్దపడ్డాడు. అందులో భాగంగానే ఆమెకు విడాకుల నోటీసులు పంపించాడు. అయితే రమ్య మాత్రం విడాకులు ఇవ్వడానికి అంగీకరించడం లేదు. దాంతో నరేష్-పవిత్రలు గత కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ మెుదటి భర్త సుచేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యాలు తాజాగా పెద్ద దూమారాన్ని లేపుతున్నాయి. గతంలోనే వీరిద్దరి వ్యవహారంపై సుచేంద్ర ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా మరోసారి నరేష్-పవిత్ర లోకేష్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్భంగా సుచేంద్ర ప్రసాద్ మాట్లడుతూ..”పవిత్రకు విలాసవంతమైన లైఫ్ అంటే ఇష్టం. అలాంటి జీవితం కోసం ఏ పనిచేయడానికైనా ఆమె సిద్దపడుతుంది. ఇక ఆమెను మించిన అవకాశవాది ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరు. అయితే నరేష్ విషయంలో ఆమె ప్లాన్ వేరే ఉంది. అది ఎవరికీ తెలియడం లేదు. ఆ ప్లాన్ ఏంటంటే? నరేష్ తల్లి విజయ నిర్మల సంపాదించిన రూ.1500 కోట్ల ఆస్తిని కొట్టేయడానికే నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోంది” అంటూ బాంబు పేల్చాడు సుచేంద్ర ప్రసాద్. అయితే ఆమె ప్లాన్ నరేష్ కు ఇంకా అర్ధం కావట్లేదని ఆయన చెప్పుకొచ్చాడు. కేవలం డబ్బు కోసం ఇప్పటికే ఇద్దరికి విడాకులు ఇచ్చిందని సుచేంద్ర ప్రసాద్ అన్నాడు. అయితే పవిత్ర ప్లాన్ త్వరలోనే నరేష్ కు తెలుస్తుందని ఈ సందర్భంగా సుచేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. మరి సుచేంద్ర ప్రసాద్ ఆరోపించినట్లుగానే విజయ నిర్మల ఆస్తి కొరకు నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.