సినీ ఇండస్ట్రీలో హీరోల స్టార్డమ్ బట్టి.. సినిమాలకు భారీగా బిజినెస్ జరగడం, హైప్ క్రియేట్ అవ్వడం జరుగుతుంటాయి. అలాగని అన్నిసార్లు హీరోల క్రేజ్ తోనే హైప్ వస్తుందా అంటే అదికూడా కాదు. కొన్నిసార్లు సినిమాలకు సాలిడ్ బిజినెస్ జరగాలన్నా, కలెక్షన్స్ రావాలన్నా దర్శకనిర్మాతల పేర్లు కూడా భాగం అవుతాయి. ముఖ్యంగా ప్లాప్ లో ఉన్న హీరోల సినిమాలకు ఎక్కువగా ఫ్యాన్స్ నమ్మేది దర్శకుడు, నిర్మాతలనే. ఎందుకంటే.. ఇన్ని ప్లాప్స్ తర్వాత కనీసం వీళ్లయినా మంచి హిట్ ఇస్తారేమో అని చిన్న ఆశ. అయితే.. ప్లాప్స్ లో ఉన్న హీరో సినిమా విడుదలై.. సాలిడ్ హిట్ అందుకుంటే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? అనేది గమనించాలి.
ఒక సినిమా హిట్ అయ్యిందనే.. ప్లాప్స్ లో ఉన్న హీరోకి పెద్ద హిట్ పడిందంటే ఆ క్రెడిట్ కేవలం హీరో ఖాతాలో మాత్రమే వేయకూడదని అంటున్నారు సినీ ప్రేమికులు. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా.. మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో.. కలెక్షన్స్ అదరగొడుతూ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా.. జాన్ అబ్రహం విలన్ గా నటించారు.
ఇక సినిమా విడుదలై రెండు వారాలు దగ్గరపడుతోంది. ఇప్పటికే కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ దాటి సాలిడ్ ప్రాఫిట్స్ వైపు పరుగులు పెడుతోంది పఠాన్. వరల్డ్ వైడ్ రూ. 250 కోట్ల బిజినెస్ చేసిన పఠాన్.. 12 రోజుల్లో రూ. 800 గ్రాస్, 430 కోట్ల నెట్ షేర్ వసూల్ చేసి రికార్డు సెట్ చేసింది. కాగా.. ప్రస్తుతానికి ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా లాభాలతో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. ఈ క్రమంలో పఠాన్ సినిమా క్రెడిట్ ని షారుఖ్ ఖాతాలో వేస్తూ.. దాదాపు పదేళ్ల తర్వాత సాలిడ్ హిట్, కేవలం షారుఖ్ క్రేజ్ తోనే సాధ్యమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా లవర్స్ రియాక్ట్ అవుతూ.. పఠాన్ సక్సెస్ లో షారుఖ్ పాత్ర ఎంత ఉన్నా.. ప్లాప్స్ లో ఉన్న షారుఖ్ కి హిట్ ఇచ్చిన దర్శకనిర్మాతలు సిద్ధార్థ్ ఆనంద్, ఆదిత్య చోప్రాలకు కూడా క్రెడిట్ ని షేర్ చేయాలని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పఠాన్ మూవీ టీమ్ తో పాటు షారుఖ్ ఫ్యాన్స్ కూడా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో.. పఠాన్ సక్సెస్ క్రెడిట్ కేవలం షారుఖ్ దే కాదనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#Pathaan 💥#Sharukhkhan pic.twitter.com/MKLX9tvcZn
— Skyups Media (@skyupsMedia) February 6, 2023
#Pathaan is 400 NOT OUT… Remains an UNSTOPPABLE FORCE, packs a MASSIVE ₹ 63.50 cr in Weekend 2 [#Hindi]… EXCELLENT jump on [second] Sat and Sun adds power to the BIG TOTAL… [Week 2] Fri 13.50 cr, Sat 22.50 cr, Sun 27.50 cr. Total: ₹ 414.50 cr. #Hindi. #India biz. pic.twitter.com/CllelpRsPs
— taran adarsh (@taran_adarsh) February 6, 2023