చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్(అకాడమీ) అవార్డులకు ఈ ఏడాది ఏర్పాట్లు రెడీ అయిపోయాయి. ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలవారు ఆస్కార్ ని గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఏడాది 95వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో మార్చి 12న ఆస్కార్ వేడుకలు జరుగనున్నాయి. మరి ఇప్పటిదాకా ఎంతమంది భారతీయులు ఆస్కార్ గెలిచారు?
చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్(అకాడమీ) అవార్డులు ఈ ఏడాది ఎంతో గ్రాండ్ గా జరిగాయి. ఇది 95వ ఆస్కార్ వేడుక. ఇన్నేళ్ల ఆస్కార్ జర్నీలో అవార్డులు అందుకున్న భారతీయుల సంఖ్య చాలా తక్కువ. ప్రతీ ఏటా జరిగినట్లే.. ఈసారి కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల సినిమాలు ఆస్కార్ ని గెలిచేందుకు ప్రయత్నాలు చేశాయి. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగాయి. కాగా.. నాటు నాటు సాంగ్, ది ఎలిఫెంట్ విస్ఫరర్స్ ఈసారి ఇండియా నుండి ఆస్కార్ గెలిచాయి. మరి ఇప్పటిదాకా ఏయే సినిమాలు/ఎంతమంది భారతీయులు ఆస్కార్ గెలిచారు? అనేది చూద్దాం!
1983లో మొదటిసారి ఇండియాకి ఆస్కార్ పురస్కారాన్ని భాను అథైయా. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకి గానూ ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్’గా భాను ఆస్కార్ గెలుపొందారు. ఈ సినిమాకి భానుతో పాటు ఇంగ్లాండ్ కి చెందిన జాన్ మొల్లో కూడా కాస్ట్యూమ్స్ కి వర్క్ చేసి ఆస్కార్ అందుకున్నారు. కాగా.. గాంధీ సినిమా.. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించిన భాను అసలు పేరు.. భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యాయ్. ఈమె గాంధీతో పాటు లగాన్, లేకిన్, స్వదేశ్, 1942 ఏ లవ్ స్టోరీ.. లాంటి బిగ్ హిట్స్ కి వర్క్ చేశారు. చివరికి 2020లో కన్నుమూశారు. (గాంధీ మూవీకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో సితారిస్ట్ రవి శంకర్ నామినేట్ అయ్యారు).
ఇండియన్ సినీ చరిత్రలో శాశ్వతంగా తన పేరును నిలుపుకున్న లెజెండరీ ఫిలిం మేకర్స్ లో సత్యజిత్ రే ఒకరు. కెరీర్ లో దాదాపు 36 సినిమాలను తెరకెక్కించి.. సినీ రంగానికి విశేష సేవలందించినందుకు.. 1992లో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సత్యజిత్ రేని హానరరీ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు సత్యజిత్ రే. ఆస్కార్ వరించిన అదే ఏడాది అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన తెరకెక్కించిన పథేర్ పాంచాలి, అపరాజితో, పరశ్ పాతర్, దేవి, అపూర్ సన్సార్, కాంచనజంగా, చారులత.. లాంటి చాలా సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి.
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గుల్జార్.. ఆస్కార్ అందుకున్నారు. ఈ సినిమాలో ‘జయహో’ సాంగ్ లిరిక్స్ కి గాను గుల్జార్ ఆస్కార్ గెలిచారు. ఈయన గురించి ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా, రచయితగా, లిరిసిస్ట్ గా సేవలందించారు.
ఇప్పటివరకు ఇండియా నుండి రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి గాను ఒరిజినల్ సాంగ్(జయహో), ఒరిజినల్ స్కోర్ కేటగిరిలలో రెహమాన్ రెండు ఆస్కార్ లను అందుకొని చరిత్రలోకెక్కారు. ఆ తర్వాత 2011లో 127 అవర్స్ మూవీకి గాను రెహమాన్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్కోర్ కేటగిరిలలో నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటిదాకా ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను ఖాతాలో వేసుకున్నారు.
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ గెలుపొందారు. ఆ సినిమాకి రిచర్డ్ ఫ్రెక్, ఇయాన్ ట్యాప్ లతో కలిసి రసూల్ ఈ అవార్డు అందుకున్నారు. కాగా.. రసూల్ పూకుట్టి.. ఇప్పటిదాకా ఎన్నో బిగ్గెస్ట్ మూవీస్ కి వర్క్ చేశారు. రోబో, రెమో, రోబో 2.o, ఒత్త సెరుప్పు సైజు 7, కేరళ వర్మ పలసి రాజా లాంటి సినిమాలు.. రసూల్ కి మంచి పేరు తీసుకొచ్చాయి.
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో గునీత్ నిర్మించిన ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ 2019లో ఆస్కార్ గెలుపొందింది.
95వ ఆస్కార్ వేడుకలలో ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నామినేట్ అయిన.. ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచింది. ఈ సాంగ్ ని ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ స్టేజ్ పై అవార్డులు అందుకున్నారు.
95వ ఆస్కార్ వేడుకలలో ఇండియన్ ఫిలిం మేకర్స్ గునీత్ మోంగా, కార్తీకి గొన్సాల్వ్స్ రూపొందించిన ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ ఆస్కార్ గెలిచింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ని ఆస్కార్ వరించింది. ప్రొడ్యూసర్ గునీత్ మోంగాకి ఇది రెండో ఆస్కార్ అనే చెప్పాలి. 2019లో గునీత్ ప్రొడ్యూస్ చేసిన ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’కి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ గెలిచింది.