బెట్టింగ్, పందాలు పేరు ఏదైనా సరే.. వినపడగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది క్రికెట్, ఎన్నికలు. మన దేశంలో ప్రధానంగా బెట్టింగ్ జరిగేది ఈ రెండు అంశాల మీదే. కానీ తొలిసారి అందుకు భిన్నమైన సందర్భం కనిపిస్తోంది. ఆ వివరాలు..
మన దగ్గర సాధారణంగా క్రికెట్ మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతుంటుంది. ప్రపంచకప్, ఐపీఎల్ సమయంలో.. ఈ బెట్టింగ్ దందా జోరందుకుంటుంది. ఇది పక్కన పెడితే.. ఎన్నికల వేళ.. ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ నాయకుడు గెలుస్తాడు.. ఎవరు ఓడిపోతారు అనే దాని మీద జోరుగా బెట్టింగ్ జరుగుతుంటుంది. ఇవి కాక సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాల వేళ బెట్టింగ్ జోరందుకుంటుంది. సాధారణంగా మన దగ్గర బెట్టింగ్ జరిగే సందర్భాలు ఇవే. కానీ తొలిసారి ఇందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డ్‌కు సంబంధించి ఇండియాలో జోరుగా కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. ఆ వివరాలు..
ఆస్కార్ అవార్డ్స్-2023 సోమవారం తెల్లవారుజామున ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి వేదికగా.. 95 అకాడమీ అవార్డుల ప్రధాన కార్యక్రమం అట్టహసంగా ప్రాంరభమైంది. ఈసారి ఆస్కార్ బరిలో ఇండియా నుంచి నామినేట్ అయిన ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కొందరు ఇంగ్లీష్ డ్యాన్సర్లు వచ్చి స్టేజీ మీద నాటు నాటకు స్టెప్పులేశారు అంటే.. ఈ పాటుకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాటు నాటు పాట ఆస్కార్ గెలవాలని.. ప్రతి భారతీయుడు మరీ ముఖ్యంగా తెలుగు వారంతా కోరుకుంటున్నారు. నాటు నాటు పాట ఆస్కార్‌బరిలో నిలవడంతో.. ఇండియాలో తొలిసారి ఓ ఆసక్తిర సన్నివేశం చోటు చేసుకుంది.
నాటు నాటు పాట ఆస్కార్ గెలుస్తుందా లేదా అన్న దాని మీద ప్రస్తుతం ఇండియాలో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. భారత్‌లోని ప్రధాన నగరాలై ముంబై, హైదరాబాద్, బెంగుళూరుల్లో ఆన్‌లైన్‌లో బుకీలు 1:4 రేషియోలో బెట్టింగ్‌కి తెర తీశారు. దాంతో కోట్లలో డబ్బులు చేతులు మారుతుంది. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ బుకింగ్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో బెట్టింగ్ అంటే క్రికెట్, ఎన్నికలు. అలాంటిది తొలి సారి ఓ సినీ అవార్డుకు సంబంధించి కోట్లలో బెట్టింగ్ జరగడం గమనార్హం. ఇది చట్టపరంగా తప్పైనా.. నాటు నాటు రేంజ్ ఇది అంటున్నారు అభిమానులు.
ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అంతర్జాతీయంగా పలు అవార్డులను దక్కించుకోవటంతో పాటు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ రేసులో నిలిచింది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నాటు నాటు పాటను చంద్రబోస్ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, జూనియర్ కొమరం భీం పాత్రలో నటించారు. వీరితో పాటు ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరన్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్, ఒలివియా మోరిస్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఇక నాటు నాటు ఆస్కార్ గెలవాలని ఇండియన్ సినీ ప్రియులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నాటు నాటు పాటకు సంబంధించి బెట్టింగ్ జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#NaatuNaatu live performance at the Oscars Stage Got a massive response and a standing ovation.🌟✨🔥🙏#NaatuNaatuForOscars 💪😍 @RRRMovie pic.twitter.com/ePS5wfwSXo
— SumanTV (@SumanTvOfficial) March 13, 2023