విజయ్ దేవరకొండ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే.. ఎంతో స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. అభిమానులు.. తనను ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికి.. సినిమాల మీద ఆసక్తితో.. ఇండస్ట్రీలోకి వచ్చి.. తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్, టాప్ హీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చే విషయంలో విజయ్ దేవరకొండ ఓ అడుగు ముందే ఉంటాడు. తన పుట్టిన రోజు సందర్భంగా రకరకాల కార్యక్రమాలు చేపడతాడు. ఇక కరోనా సమయంలో.. తన ఫౌండేషన్ ద్వారా.. దాదాపు 1700కు పైగా కుటుంబాలకు సాయం చేశాడు విజయ్ దేవరకొండ.
ఈ క్రమంలోనే క్రిస్టమస్ సందర్భంగా.. ఐదేళ్ల కిందట ‘దేవర శాంటా’ పేరుతో ఒక ట్రెడిషన్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. దేవర శాంట పేరుతో.. అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇస్తోన్న విజయ్ దేవరకొండ.. ఈసారి మరొక అద్భుతమైన ఐడియాతో అభిమానులను సర్‌ప్రైజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని క్రిస్మస్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు విజయ్ దేవరకొండ.
క్రిస్మస్ రోజున ట్విట్టర్ వేదికగా ఫాలోవర్స్‌కి అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. దానిలో భాగాంగా..‘నేను మీలో 100 మందిని హాలీడేకి పంపబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఖర్చులను నేనే భరిస్తాను. డెస్టినేషన్ సెలెక్ట్ చేసేందుకు నాకు హెల్ప్ చేయండి’ అని ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో ప్రకటించిన ఆఫర్‌పై అభిమానులు ఫుల్ ఖషీ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ యూజర్.. ‘థాంక్స్ అన్నా.. నేను అడగ్గానే స్పందించినందుకు’ అంటూ కామెంట్ చేశాడు. నిజానికి సదరు యూజర్.. విజయ్ నుంచి ప్రకటన రావాడానికి ముందే.. ‘అన్నా.. ఈసారి ‘దేవర శాంటా’ పెట్టలేదు’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా విజయ్ దేవరకొండ ఈ ఆఫర్ ప్రకటించాడు.
ఇక గతంలో లాక్‌డౌన్ టైమ్‌లో క్రిస్మస్ సందర్భంగా విజయ్ దేవరకొండ.. తన ఫాలోవర్స్ అడిగిన గిఫ్ట్స్ ఇచ్చి.. వారిని సర్‌ప్రైజ్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా.. వర్చువల్ హగ్స్ ఇవ్వడంతో పాటు, ప్రత్యేక ఆశ్రమాల్లో ఉంటున్నపిల్లల దగ్గరకు వెళ్లి.. వారితో కలిసి టైమ్ స్పెండ్ చేశాడు విజయ్. గత ఐదేళ్లుగా.. ఈ ట్రెడిషన్‌ను కొనసాగిస్తున్నాడు. దానిలో భాగంగానే ఈ ఏడాది పెయిడ్ హాలిడే ఆఫర్ ప్రకటించి.. సర్‌ప్రైజ్ చేశాడు.
ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత పూర్తయ్యింది. అయితే సమంత.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రస్తుతం ఖుషీ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సామ్ కోలుకున్న తర్వాత.. మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక లైగర్ డిజాస్టార్ కావడంతో.. విజయ్ చేయాల్సిన కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. మరి అభిమానుల కోసం విజయ్ దేవరకొండ ప్రకటించిన ఈ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Deverasanta, a tradition I started 5 years ago. This year I have the nicest idea so far 🙂
I am going to send 100 of you on an all-expense paid holiday. Help me in choosing the destination. #Deverasanta2022https://t.co/iFl7mj6J6v
— Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2022