తెలుగు ప్రజల మనసు గెలుచుకున్న కామెడీ షో అంటే అందరూ చెప్పే పేరు ‘జబర్దస్త్’. దాదాపు పదేళ్ల నుంచి టీవీ, యూట్యూబ్ ప్రేక్షకుల్ని నవ్విస్తున్న ఈ షో.. ఇప్పటికే అలరిస్తూనే ఉంది. ఇక ఈ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకుంటూనే ఉన్నారు. వారిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులున్నారు. అయితే ‘జబర్దస్త్’లో కామెడీతో పాటు జోడీలు కూడా చాలా ఫేమస్. సుధీర్-రష్మీతో మొదలైన ఈ ట్రెండ్.. ప్రస్తుతం చాలా జంటలతో కళకళలాడుతోంది. వారిలో నూకరాజు-ఆసియా జోడీ కూడా ఒకటి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘పటాస్’ స్టాండప్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన నూకరాజు, కమెడియన్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ‘జబర్దస్త్’లో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. అయితే మనోడు.. ఇదే షోలో చేస్తున్న ఆసియాతో ప్రేమలో ఉన్నాడు! రీల్ జోడీగా చాలా స్కిట్ లు చేసిన వీళ్లిద్దరూ.. రియల్ లైఫ్ లోనూ పెళ్లి చేసుకుంటామని చాన్నాళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. ఇరు కుటంబాల పెద్దలు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే తెలుస్తోంది. అయితే ఇప్పుడు జరిగింది మాత్రం ప్రేక్షకులని షాకింగ్ లో పడేసింది.
తాజాగా ‘జబర్దస్త్’ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నే నూకరాజు స్కిట్ గా చేసినట్లు తెలుస్తోంది. నూకరాజు-ఆసియా.. ఇద్దరు తల్లిదండ్రులు ఈ స్కిట్ లో భాగమయ్యారు. అంతా పూర్తయిన తర్వాత ఇంద్రజ జడ్జిమెంట్ ఇస్తున్న టైంలో.. నూకరాజు తల్లి ఆసియాతో పెళ్లికి అడ్డు చెప్పింది! ‘మేడమ్ ఇది స్కిట్ వరకే అన్నారు. నిజంగా అయితే ఇది కుదరదు మేడమ్’ అని బాంబు పేల్చారు. తొలుత ఆసియా షాకైంది. ఆ తర్వాత అందరూ ఒక్కసారిగా స్టన్ అయ్యారు. అయితే నూకరాజు-ఆసియా లవ్ స్టోరీకి బ్రేక్ వేయడం అంతా కూడా స్కిట్ లో భాగంగానే చేశారనిపిస్తోంది. మరి ఈ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.