ఇండియాలో ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలను ఆమె ఖండించారు. పాకిస్తాన్ కంటే ఇండియాలోనే ముస్లింలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె వాషింగ్టన్ పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకానమిక్స్‌లో జరిగిన ఓ చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ముస్లిం మెనార్టీలకు సంబంధించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. భారత్‌లో ముస్లిం మైనార్టీలపై హింస, ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత వంటి విషయాలపై కొంతమంది ఆమెకు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సీతారామన్ కొంచెం ఘాటుగా స్పందించారు.
ప్రశ్నలు అడిగిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘ ముస్లిం మైనార్టీల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో ఇండియాది రెండో స్థానం. ముస్లింల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. వారి జీవితాలు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే ఇంతలా వారి జనభా పెరగగలదా? ఇస్లామిక్ దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌లో మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ వారి జనాభా రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. కానీ, భారత్‌లో ఆ పరిస్థితి లేదు. భారత్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్నది అవాస్తవం.
వాస్తవాలను తెలుసుకోకుండా ఓ దేశాన్ని తప్పుబట్టకూడదు. పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కంటే.. భారత్‌లో ఉన్న ముస్లింలు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. తప్పుడు వార్తలు రాసేవారు ఇండియా రండి. దేశమంతా చుట్టీ చేస్తున్న ఆరోపణలు నిజం అని నిరూపించండి’’ అంటూ సవాల్ విసిరారు. మరి, పాకిస్తాన్లో కంటే ఇండియాలోని ముస్లింలే సంతోషంగా జీవిస్తున్నారన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.