జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. మత్స్యకారుల కోసం చేస్తున్న ర్యాలీలో పవన్ అభిమాని అత్యుత్సాహం చూపించాడు. మత్య్సకారుల కోసం పవన్ కళ్యాణ్ నరసాపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు ర్యాలీగా వెళ్తుండగా, ఓ అభిమాని ఆయన కారు పైకి ఎక్కాడు. కౌగిలించుకోవాలని ప్రయత్నించగా బాడీగార్డులు అడ్డుకున్నారు. ఈ గందరగోళంలో పవన్ కళ్యాణ్ కిందపడిపోయారు.అయితే ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి హాని జరగలేదు. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మత్య్సకారుల కోసం పవన్ కళ్యాణ్ రాజమండ్రి నుంచి నరసాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పవన్ కు అడుగడుగున జనసైనికులు నీరాజనాలు పలుకుతున్నారు. కారుపై నిలబడి అభివాదం చేస్తున్న సమయంలో ఆయన వెనుక ఓ అభిమాని కారు ఎక్కడంతో ఇబ్బందికి లోనయ్యాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అభిమాని కారుపై నుంచి దించేశారు. ఈ క్రమంలో పట్టు తప్పి పవన్ కింద పడబోయారు. అయితే ఈఘటనలో ఆయనకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

