బాలీవుడ్ లో తన అందచందాలతో ఎంతో మంది కుర్రాళ్ల మనసు దోచింది నటి నేహా దూపియా. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తనదైన సత్తా చాటింది. బాలీవుడ్‌తోపాటు పలు ఇతర భాషల్లో నటనతో భారీగా అభిమానులను సంపాదించుకున్న నేహాదూపియా, అంగద్ బేడీ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని అంగద్ బేడీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు.
కాగా, ఇప్పటి వరకు నేహా దూపియా కి సంబంధించిన ప్రతి ఫోటో ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ వచ్చారు ఆమె భర్త అంగద్ బేడీ. తమకు బిడ్డ పుట్టిన సమాచారం ఇవ్వడంతోపాటు వాళ్లు మెటర్నిటీ ఫొటోషూట్ సందర్భంగా తీసుకున్న ఒక అందమైన పొటోను కూడా అంగద్ బేడీ షేర్ చేశాడు. మా పాప మెహర్ చిన్నారి పోస్ట్‌ను తన తమ్ముడికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది అని అంగద్ బేడీ ఇన్‌స్టా హ్యాండిల్‌లో రాశారు.
అంతే కాదు గర్భం దాల్చడం మొదలు బిడ్డ పుట్టే వరకు జరిగిన ప్రయాణంలో అన్ని కష్టాలను ఎదుర్కొన్న నేహాకు అంగద్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ దంపతులకు 2018లో మెహర్ జన్మించింది.మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ జంటకు మగబిడ్డ పుట్టాడు.