తెలుగు ఆడియెన్స్.. సినిమా అంటే చాలు ప్రాణమిస్తారు. భాషతో సంబంధం లేదు.. ఒక్కసారి నచ్చితే చాలు చూసి ఏ మాత్రం ఊరుకోకుండా, సినిమా బాగుందని మరో నలుగురికి చెప్తారు. ఇక చిత్రంలో యాక్ట్ చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటారు. అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఆడియెన్స్ మనసుల్లో చోటు సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకుర్. ‘సీతారామం’లో సీతగా అద్భుతమైన అభినయం చూపి, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. ఇక తెలుగులో ఆమె నెక్స్ట్ ఏ సినిమా చేయనుందా అనే ఒకటే టెన్షన్స్.
ఇక విషయానికొస్తే.. భారత్-పాక్ దేశాల బ్యాక్ డ్రాప్ తో తీసిన అద్భుతమైన ప్రేమకథ ‘సీతారామం’. ఇందులో హీరోహీరోయిన్ గా చేసిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ తెలుగు వాళ్లు కాదు అయినా సరే అద్భుతమైన యాక్టింగ్ తో కట్టిపడేశారు. ‘మహానటి’లో చేయడం వల్ల దుల్కర్ తెలుసు. కానీ ఫస్ట్ టైమ్ హీరోయిన్ గా చేసినప్పటికీ.. చాలా పరిణితితో కనిపించింది. సంప్రదాయ చీరకట్టులో వావ్ అనిపించింది. ఇక కుర్రాళ్ల అయితే ఈమెని క్రష్ లిస్ట్ లోకి చేర్చేశారు. దీంతో ఆమె హీరోయిన్ చేయబోయే తర్వాత సినిమా ఏంటాని రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
అవన్నీ పక్కనబెడితే.. ఇప్పుడు మృణాల్, నేచురల్ స్టార్ నానిని కలవడం హాట్ టాపిక్ అయింది. నాని గతంలో ‘సీతారామం’ డైరెక్టర్ హను రాఘవపూడితో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చేశాడు. సో సినిమా సక్సెస్ అయిందని చెప్పడానికి వీళ్లిద్దరూ కలిశారా.. లేదంటే నాని-మృణాల్ జంటగా కొత్త ప్రాజెక్టు ఏమైనా ఫిక్స్ అయిందా అనేది చూడాలి. ‘సీతారామం’ టీమ్ తో మరో మూవీ ఉందని నిర్మాత అశ్వనీదత్ ఇప్పటికే ప్రకటించారు. అలానే నాని కోసం హను ఓ కథ రెడీ చేసినట్లు వార్తలొచ్చాయి. మరి వీటన్నింటికీ ఎండ్ కార్డ్ పడాలంటే నాని లేదా మృణాల్ రెస్పాండ్ కావాల్సిందే. మరి నాని-మృణాల్ జంటపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.