సినీ ఇండస్ట్రీలో సెలెబ్రిటీలు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం.. తర్వాత కొంతకాలానికి విడిపోవడం అనేది మామూలే అయిపోయింది. ఇదివరకటిలా జీవితాంతం ఒక్కరితోనే అనే సంప్రదాయానికి ఎవరూ కట్టుబడి ఉంటడం లేదు. సెలబ్రిటీలైనా, సామాన్య జనాలైనా ఇద్దరి మధ్య బంధం బాగుంటే కలిసి జీవిస్తున్నారు. అదే సంసారంలో చిన్న పొరపాట్లు, గొడవలు, మనస్పర్థలు తలెత్తినా వెంటనే విడిపోవడం, విడాకులకు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో మనం ఇలాంటి సంఘటనలు ప్రతిరోజూ ఎన్నో చూస్తున్నాం. అయితే.. ప్రేమించి పెళ్లిచేసుకొని విడిపోవడంలో హీరోహీరోయిన్స్ ఏం మినహాయింపు కాదు.
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నవారిలో అక్కినేని నాగచైతన్య, సమంత ముందంజలో ఉంటారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకొని 2017లో ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే.. ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు గానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. బెస్ట్ కపుల్ అనిపించుకున్నవారు నాలుగేళ్లకే విడాకులు ప్రకటించేసరికి ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ కి గురయ్యారు. చైతూ, సామ్ ఇద్దరూ విడిపోయి చాలా నెలలు అవుతున్నా.. ఇప్పటికి వీరికి సంబంధించి వార్తలు, కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. విడాకుల విషయంలో చైతూ, సామ్ ఇద్దరూ మీడియా ముఖంగానే తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయామని.. చెప్పాల్సింది చెప్పేశాం అని ఆన్సర్ ఇచ్చేశారు.
ఈ క్రమంలో చైతన్య తండ్రి అక్కినేని నాగార్జునకు చైతూ, సామ్ డివోర్స్ కి సంబంధించి ప్రశ్న ఎదురైంది. నాగ్ కూడా సమాధానాన్ని దాటవేయాలని చూడకుండా సూటిగా ఆన్సర్ చెప్పేశాడు. చైతూకి సంబంధించి అతని సినిమాలకంటే.. పర్సనల్ లైఫ్ పై చర్చలు జరగడం చూసి తండ్రిగా మీరు ఇబ్బంది పడుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు..‘ప్రస్తుతం చైతూ హ్యాపీగా ఉన్నాడు. నేనది చూస్తున్నాను.. అది చాలు. మేమెప్పుడు ఆ విషయం గురించి ఆలోచించట్లేదు. మా జీవితాలలో ఆ విషయం ముగిసిపోయింది. అలాగే అందరి జీవితాల్లో కూడా ముగుస్తుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు కింగ్ నాగ్. దీంతో నాగార్జున మాటలు సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో వైరల్ గా మారాయి. మరి నాగార్జున మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#KingNagarjuna about #NagaChaitanya.@iamnagarjuna @chay_akkineni pic.twitter.com/FrWNwlWANN
— Fukkard (@Fukkard) September 15, 2022