అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు వైరల్‌గా మారింది. అందుకు కారణం లేకపోలేదు.. నవంబర్ 23న చై బర్త్‌డే సందర్భంగా నెక్ట్స్ మూవీ కస్టడీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. తమిళ డైరెక్టర్ నాగప్రభు ఈ మూవీని అటు తమిళ్, ఇటు తెలుగులో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీసుగా కనిపించనున్నాడు. విడుదలైన ఫస్ట్ లుక్ చాలా అద్భతంగా ఉంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రపంచంలో మార్పు రావాలంటే ముందు నువ్వు మారాలి అనే లైన్ అందరినీ ఆలోజింపచేస్తోంది. పోస్టర్‌లో తోటి పోలీసులు నాగచైతన్యను ఎందుకు పట్టుకున్నారు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు. ఫస్ట్ లుక్‌కు అటు కోలీవుడ్‌లోనూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇప్పుడు నాగచైతన్య పేరు వైరల్ కావడానికి మరో రీజన్ కూడా ఉంది. ప్రస్తుతం నాగచైతన్యకు చెందిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నాగచైతన్య- శోభితా ధూళిపాళ్లతో ఫొటోకి ఫోజు ఇచ్చాడు. అయితే వీళ్ల ఇద్దరి మధ్య ఏదో ఉంది అని.. వాళ్లు లివ్ ఇన్ లో ఉన్నారు అని.. ఇద్దరూ కొద్ది రోజుల నుంచి డేటింగ్ చేస్తున్నారని చాలానే వార్తలు వచ్చాయి. వాటిపై ఇద్దరూ నేరుగా స్పందించింది లేదు. కానీ, శోభితా మాత్రం ఓసారి పరోక్షంగా ఘాటుగానే స్పందించింది. ట్రోలర్లకు సమాధానం అన్నట్లు ఓ చిన్న వీడియో చేసింది. అందులో శోభితా మిడిల్ ఫింగర్ చూపించడం హాట్ టాపిక్ అయ్యింది. లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇదే ప్రశ్న చైని అడగ్గా.. నవ్వడం తప్ప ఏం చేయలేను అని సమాధానం చెప్పాడు.
Ahaaaa !!! Official chesela unnaru ga twaralone 😳 pic.twitter.com/sgVmhXCv1Y
— S!D 🧘 (@OptimistSiD) November 24, 2022
అయితే మళ్లీ వీళ్లు ఇద్దరూ కలిసి కనిపించడం, ఫొటోకి ఫోజు ఇవ్వడంతో ఆ పుకార్లు నిజమేనేమో అనే అనుమానాలు, అభిప్రాయాలు మొదలయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారా? అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే వీళ్లు ఈ ఫొటోకి ఫోజు ఇచ్చింది ఎక్కడ? ఎప్పుడు? ఏ సందర్భంలో అనే వాటికి మాత్రం సమాధానాలు తెలియాల్సి ఉంది. ఇంక కస్టడీ సినిమా విషయానికి వస్తే.. నాగచైతన్య సరసన కృతిశెట్టి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ మూవీలో అరవిందస్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్, ప్రేమ్ జీ, సంపత్ రామ్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
New beginnings ?? #Nagachaitanya #NC22 pic.twitter.com/emhJ4eELW0
— RamPratapReddy (@RamPratapReddy) November 25, 2022